నాపై ఎలాంటి దాడి జరగలేదు.. కన్నడిగులు బాగా చూసుకున్నారు , అంతా దుష్ప్రచారమే : మంగ్లీ క్లారిటీ

By Siva KodatiFirst Published Jan 22, 2023, 10:05 PM IST
Highlights

తనపై ఎలాంటి రాళ్ల దాడి జరిగలేదన్నారు ప్రముఖ నేపథ్య గాయనీ మంగ్లీ. అదంతా దుష్ప్రచారమేనని, ఇదంతా తన ప్రతిష్టను కించపరచడానికి చేస్తున్నారని మంగ్లీ మండిపడ్డారు. 

ప్రముఖ సినీ నేపథ్య గాయని మంగ్లీపై దాడి జరిగిదంటూ ఫోటోలు, వీడియోలు బయటకు రావడంతో టాలీవుడ్ ఉలిక్కిపడింది. ఈ నేపథ్యంలో మంగ్లీ స్పందించారు. అదంతా దుష్ప్రచారమేనని, అవన్నీ తప్పుడు వార్తలేనని మంగ్లీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. 

‘‘ నిన్న బళ్లారిలో జరిగిన ఓ కార్యక్రమంలో నాపై దాడి జరిగిందని కొన్ని సోషల్ మీడియా గ్రూపులు ప్రచారం చేస్తున్న తప్పుడు వార్తలను నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఫోటోలు మరియు వీడియోల నుండి మీరందరూ చూడగలిగే విధంగా, ఈవెంట్ భారీ విజయాన్ని సాధించింది మరియు ఉత్తమ ఈవెంట్‌లలో ఒకటి, కన్నడ ప్రజలు నాపై కురిపించిన ప్రేమ మరియు మద్దతు అపారమైనది. ఈవెంట్ లో  నన్ను చాలా బాగా చూసుకున్నారు, ఇది మాటలలో వర్ణించలేనిది .ఇదంతా నా ప్రతిష్టను కించపరచడానికి చేస్తున్నారు మరియు ఈ విధమైన తప్పుడు ప్రచారాన్ని నేను ఖండిస్తున్నాను ’’ అంటూ మంగ్లీ స్పష్టం చేశారు. 

ALso REad: సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి.. అద్దాలు ధ్వంసం.. అసలేం జరిగిందంటే..?

కాగా.. తెలుగులో సింగర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ.. ఇతర భాషల్లో తన గానంతో ఆదరణ సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో శనివారం రాత్రి మంగ్లీ బళ్లారిలోని మున్సిపల్ కళాశాల మైదానంలో బళ్లారి ఉత్సవ్ కార్యక్రమంలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె స్టేజ్‌ మీద పాటలు పాడటం ముగించుకుని..అక్కడి నుంచి బయలుదేరేందుకు సిద్దమైంది. ఈ క్రమంలోనే స్టేజ్ వెనక్కి వెళ్లింది. అయితే ఆమెను చూసేందుకు పెద్ద ఎత్తున యువకులు అక్కడికి చేరుకున్నారు. అయితే వేదిక వెనుకవైపు ఉన్న మేకప్ టెంట్‌లోకి కూడా యువకులు ప్రవేశించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా తోపులాట జరిగింది. ఈ క్రమంలోనే పోలీసులు యువకులపై స్వల్ప లాఠీచార్జి చేశారు. ఈ ఉద్రిక్తతల మధ్యే మంగ్లీ  కారులో అక్కడి నుంచి బయలుదేరుతుండగా.. కొందరు ఆమె ఉన్న కారుపై రాళ్లు రువ్వారు. ఈ ఘటనలో మంగ్లీ ప్రయాణిస్తున్న కారు అద్దాలు పగిలిపోయాయి. 


 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Mangli Singer (@iammangli)

click me!