
జబర్దస్త్ కమెడియన్ పంచ్ ప్రసాద్ కిడ్నీ సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఆయనకు రెగ్యులర్ గా డయాలసిస్ చేయించాల్సి ఉంది. ఈ కారణంగా ఆయన్ని పలురకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి.రెండు కిడ్నీలు పాడైన నేపథ్యంలో ఆయనకు ట్రాన్స్ప్లాంటేషన్ అనివార్యమైంది. పంచ్ ప్రసాద్ కి టాన్స్ప్లాంటేషన్ జరుగుతున్నట్లు ఆయన భార్య స్వయంగా వెల్లడించారు. ఈ మేరకు వీడియో విడుదల చేశారు.
పంచ్ ప్రసాద్ కి ఆమె కిడ్నీ ఇవ్వాలని నిర్ణయించుకున్నారట. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఆమె కిడ్నీ పంచ్ ప్రసాద్ కి సెట్ అవుతుందని చెప్పారట. అయితే మరో మార్గం ద్వారా పంచ్ ప్రసాద్ కి కిడ్నీ లభించింది. ఈ కారణంగా ఆయన భార్య ఇవ్వడం లేదు. అలాగే డాక్టర్స్ సలహా మేరకు కిడ్నీ దానం చేసే ఆలోచన మానుకున్నారట. పంచ్ ప్రసాద్ వయసు చాలా చిన్నది. భవిష్యత్ లో ఆయనకు కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు మీరు ఇవ్వొచ్చు. కాబట్టి ప్రస్తుతానికి వేరే వ్యక్తి కిడ్నీ అమర్చుదామని చెప్పారట. దాంతో పంచ్ ప్రసాద్ భార్య ఆ ఆలోచన విరమించుకున్నారట.
కిడ్నీ సంబంధిత వ్యాధి వలన పంచ్ ప్రసాద్ అనేక ఇబ్బందులు గురవుతున్నారు. సంపాదనలో ఎక్కువ మొత్తం ట్రీట్మెంట్ కే ఖర్చు అవుతుంది. ఆ మధ్య అసలు నడవలేని స్థితికి చేరుకున్నాడు. తోటి జబర్దస్త్ కమెడియన్స్ కొంతలో కొంత ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు.
జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోస్ లో అవకాశాలు ఇస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతూనే ఈవెంట్స్ లో పాల్గొంటున్నాడు. ఆ మధ్య కిరాక్ ఆర్పీ పంచ్ ప్రసాద్ కి సహాయం చేస్తానంటూ హామీ ఇచ్చాడు. పంచ్ ప్రసాద్ నా మిత్రుడు, మంచి వాడు. త్వరలో నేను మణికొండలో స్టార్ట్ చేయబోయే నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు బ్రాంచ్ నుండి వచ్చే ఆదాయం పంచ్ ప్రసాద్ చికిత్సకు కేటాయిస్తాను అన్నాడు. పది లక్షలు ఖర్చైనా అతనికి చికిత్స చేయిస్తా అన్నాడు. కొద్దిరోజుల క్రితం మణికొండలో కిరాక్ ఆర్పీ నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు షాప్ ఓపెన్ చేశారు.