
శాకుంతలం డిజాస్టర్. అయితే అల్లు అర్హ మాత్రం సూపర్ పాపులర్ అయ్యింది. బాల భరతుడు పాత్రలో అల్లు అర్హ అద్భుతం చేశారు. ఆరేళ్ళప్రాయంలో ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ ఇవ్వడం గొప్ప విషయం. అల్లు అర్హ తండ్రికి తగ్గ కూతురన్న మాట వినిపిస్తోంది. శాకుంతలం మూవీ విడుదల తర్వాత అల్లు అర్హ ఫాలోయింగ్ పెరిగింది. అల్లు అర్హను చూసేందుకు కూడా అభిమానులు ఆమె నివాసం ముందు ఎదురుచూస్తున్నారు. దీనికి సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతుంది.
అల్లు అర్జున్ నివాసం ముందు అల్లు అర్హ కోసం కొందరు అభిమానులు నినాదాలు చేశారు. వారి కేకలు విన్న అల్లు అర్హ బయటకు వచ్చింది. వాళ్ళను పలకరించేందుకు కాంపౌండ్ వాల్ వైపు వచ్చింది. అయితే అల్లు అర్హను వెళ్ళొద్దని ఓ అమ్మాయి ఆపుతుంది. ఆ అమ్మాయి మాట పట్టించుకోకుండా అల్లు అర్హ... ఫ్యాన్స్ ఎదురుగా ఒక విచిత్ర విన్యాసం చేసింది. కంటి రెప్పలు పైకి లేపి కళ్ళను భయంకరంగా మార్చి భయపెట్టింది.
ఫ్యాన్స్ మరింతగా నినాదాలు చేస్తుంటే... పక్కన ఉన్న అమ్మాయి అల్లు అర్హను అక్కడ నుండి తీసుకుపోయింది. అల్లు అర్హకు అసలు భయం ఉండదని ఆ వీడియో చూస్తే అర్థం అవుతుంది. శాకుంతలం హీరోయిన్ సమంత, డైరెక్టర్ గుణశేఖర్ బన్నీ కూతురు మీద ప్రశంసలు కురిపించారు. అల్లు అర్హకు భయం లేదని, తెలుగు స్పష్టంగా మాట్లాడుతుందని కొనియాడారు.
శాకుంతలం మూవీతో అల్లు అర్హ మెప్పించిన నేపథ్యంలో త్వరలో ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే సూచనలు కలవు. మరి అల్లు అర్జున్ ఆమెను ఎలా ప్రోత్సహిస్తారో చూడాలి. అల్లు అర్జున్ సైతం చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశారు. స్వాతిముత్యం మూవీలో అల్లు అర్జున్ చిన్న పాత్రలో కనిపించారు. తండ్రి నట వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న అల్లు అర్హ మొదటి చిత్రంతోనే సత్తా చాటింది.