పెళ్లి పీటలెక్కిన రవితేజ హీరోయిన్... అబ్బాయి ఎవరంటే!

Published : Feb 07, 2023, 05:30 PM IST
 పెళ్లి పీటలెక్కిన రవితేజ హీరోయిన్... అబ్బాయి ఎవరంటే!

సారాంశం

సియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్ పెళ్లి చేసుకున్నారు. ఆమె వివాహం ముంబైలో ఘనంగా జరిగింది. సియా తన మ్యారేజ్ వేడుక ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు.   

దర్శకుడు పూరి జగన్నాధ్ చాలా మంది బాలీవుడ్ మోడల్స్ ని సిల్వర్ స్క్రీన్ కి పరిచయం చేశాడు. వారిలో సియా గౌతమ్ అలియాస్ అదితి గౌతమ్ ఒకరు. 2008లో విడుదలైన నేనింతే మూవీతో ఆమె హీరోయిన్ అయ్యారు. రవితేజ హీరోగా నటించిన ఈ మూవీ ఫిల్మ్ ఇండస్ట్రీ సాధక బాధలు, మంచి చెడులపై సెటైరికల్ సబ్జెక్టుతో తెరకెక్కించారు. నేనింతే మూవీలో సియా గౌతమ్ హీరోయిన్ కావాలని పరిశ్రమకు వచ్చిన అమ్మాయి పాత్ర చేశారు. ఇక రవితేజ యాస్పిరంట్ డైరెక్టర్ రోల్ చేశారు. 

నేనింతే యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. తర్వాత సియాకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. ఆమె కెరీర్ చిన్న చిన్న పాత్రలకు పడిపోయింది. వేదం మూవీలో ఓ రోల్ చేశారు. కన్నడలో ఒక చిత్రంలో నటించిన సియా, సంజయ్ దత్ బయోపిక్ సంజు మూవీలో ఓ రోల్ చేశారు. చాలా కాలం తర్వాత పక్కా కమర్షియల్ మూవీలో సియా తళుక్కున మెరిశారు. 

కాగా ఫిబ్రవరి 6న సియా వివాహం చేసుకున్నారు. ఆమె వివాహం బంధుమిత్రుల నడుమ ఘనంగా జరిగింది. ముంబైలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తుంది. సియా భర్త పేరు నిఖిల్ పాల్కేవాలా అని సమాచారం. ఇతడు ముంబైలో ఓ వ్యాపారవేత్త. ఇది పెద్దలు కుదిర్చిన వివాహమా లేక లవ్ మ్యారేజా అనేది తెలియాల్సి ఉంది. సియా వివాహానికి చిత్ర ప్రముఖులు హాజరైనట్లు సమాచారం. హీరోయిన్ ప్రియమణికి సియా దోస్త్ అని తెలుస్తుండగా ఆమె వేడుకలో పాల్గొన్నారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇక సోషల్ మీడియా వేదికగా అభిమానులు, ప్రముఖులు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. 
 

PREV
click me!

Recommended Stories

Top 10 Movies 2025: పవన్, వెంకటేష్, రాంచరణ్ లలో బాక్సాఫీస్ వద్ద ఎవరి సత్తా ఎంత ? 2025లో టాప్ 10 మూవీస్ ఇవే
Akhanda 2: అఖండ 2 రిలీజ్ కి తొలగిన అడ్డంకులు, మద్రాస్ హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కానీ ఆ ఒక్క సమస్య ఇంకా ఉంది