తిరుమల  శ్రీవారిని దర్శించుకున్న శ్రియ దంపతులు

Published : Sep 14, 2021, 01:35 PM IST
తిరుమల  శ్రీవారిని దర్శించుకున్న శ్రియ దంపతులు

సారాంశం

మంగళవారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రియ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకోలేక పోయానని అన్నారు.  

ప్రముఖ నటి శ్రియ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ మంగళవారం ఉదయం వీఐపీ దర్శనంలో స్వామివారిని దర్శించుకున్న శ్రియ దంపతులను ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం శ్రియ మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా రెండు సంవత్సరాలుగా స్వామివారిని దర్శించుకోలేక పోయానని అన్నారు.  


ఇక ఆమె భర్త  ఆండ్రీ కొశ్చేవ్‌ ఆలయం ముందు శ్రియకి ముద్దు పెట్టి తన ప్రేమను వ్యక్తపరిచారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం శ్రియ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో రాజమౌళి తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో అజయ్‌ దేవగణ్‌కు జోడీగా నటిస్తున్న విషయం తెలిసిందే. అదే విధంగా ‘గమనం’ అనే మల్టీలాంగ్వేజ్‌ చిత్రంలో నటిస్తున్నారు.


దశాబ్దానికి పైగా స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ ని ఏలిన శ్రియ టాప్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టారు. ఠాగూర్,  చెన్నకేశవ రెడ్డి, ఛత్రపతి, శివాజీ వంటి చిత్రాలలో శ్రియ నటించారు. 2012లో రష్యన్ బాయ్ ఫ్రెండ్ ఆండ్రీని శ్రియ వివాహం చేసుకున్నారు. శ్రియ వైవాహిక జీవితం ఆనందంగా సాగుతుండగా, సెకండ్ ఇన్నింగ్స్ లో స్టార్స్ చిత్రాలలో ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేస్తున్నారు. 


 

PREV
click me!

Recommended Stories

Suriya Movie: రిలీజ్‌కు ముందే సూర్య మూవీ సంచలనం.. `విశ్వనాథ్ అండ్ సన్స్` బిజినెస్‌ ఎంతో తెలిస్తే ఫ్యూజుల్‌ ఔట్‌
Janaki: చెల్లిని కోల్పోయాను, జానకి మరణంపై పి సుశీల ఎమోషనల్ కామెంట్స్, కన్నీటి పర్యంతం అయిన గాయని