Pooja hegde: ముంబైలో కొత్త ఇంటిని కొన్న పూజా హెగ్డే... ఆనందానికి హద్దులు లేవుగా!

Published : Oct 28, 2021, 11:28 AM IST
Pooja hegde: ముంబైలో కొత్త ఇంటిని కొన్న పూజా హెగ్డే... ఆనందానికి హద్దులు లేవుగా!

సారాంశం

పూజా హెగ్డే ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా పూజా హెగ్డే స్వయంగా తెలియజేశారు. 


హీరోయిన్ పూజా హెగ్డే కెరీర్ మూడు పూవులు ఆరు కాయలు అన్నట్లుగా ఉంది. వరుస హిట్స్ కొడుతున్న ఈ భామ ఖాతాలో లెక్కకు మించిన ఆఫర్స్ వచ్చి చేరుతున్నాయి. తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీతో మరో హిట్ ఖాతాలో వేసుకుంది. తన సెంటిమెంట్ కొనసాగిస్తూ, అక్కినేని వారసుడు అఖిల్ కి ఫస్ట్ హిట్ అందించింది. మరి Pooja hegde పారితోషికం కూడా అదే రేంజ్ లో ఉంది. సినిమాకు ఏకంగా రూ. 3 కోట్లకు పైగా ఛార్జ్ చేస్తున్నారట. 


దీనితో ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని ఇంస్టాగ్రామ్ వేదికగా పూజా హెగ్డే స్వయంగా తెలియజేశారు. నా కలల సౌధం నిర్మించుకుంటున్నాను , అంటూ కామెంట్ చేసిన పూజా హెగ్డే, ఇంటీరియర్ డిజైన్ ని స్వయంగా పర్యవేక్షిస్తున్న ఫోటోలు పంచుకున్నారు. ఇంటి లోపల కలర్, ఫర్నిచర్, డిజైన్ వంటి విషయాలు తన టేస్ట్ కి తగ్గట్టుగా, దగ్గరుండి పూజా సిద్ధం చేయిస్తున్నారట. 

Also read Samantha: షాక్.. ప్రీతమ్ జకల్కర్ తో సమంత దుబాయ్ టూర్... ఆమె చెప్పాలనుకుంటున్న విషయం అదేనా!


బాలీవుడ్ లో కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్న పూజా, అక్కడ హౌస్ కొనుక్కున్నారు. సల్మాన్ ఖాన్ తో భాయ్ జాన్, రణ్వీర్ సింగ్ తో సర్కస్ చిత్రాలు చేస్తున్నారు పూజ. ఇక సౌత్ లో Radhe shyam, ఆచార్య, బీస్ట్ వంటి భారీ ప్రాజెక్ట్స్ లో హీరోయిన్ గా ఉన్నారు. పవన్, మహేష్ అప్ కమింగ్ చిత్రాలకు కూడా పూజా పేరును పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటీవల విడుదలైన రాధే శ్యామ్ టీజర్ భారీ ఆదరణ దక్కించుకోగా, మూవీపై అంచనాలు పెరిగాయి. 

PREV
click me!

Recommended Stories

Dhurandhar Day 50 Collection: `బోర్డర్ 2` దెబ్బకు ధురంధర్ ఆట క్లోజ్, 50 రోజుల కలెక్షన్లు
Ee Nagaraniki Emaindhi 2: శ్రీనాథ్ మాగంటికి బంపర్‌ ఆఫర్‌, ఈ నగరానికి ఏమైంది సీక్వెల్‌లో ఛాన్స్.. పాత్ర ఇదే