అర్జున్ రెడ్డి సినిమాను వదులుకున్న ఆ హీరోయిన్ ఇప్పుడు బాధపడుతుందట!

By team teluguFirst Published Jul 27, 2021, 8:51 AM IST
Highlights

అర్జున్ రెడ్డి కథ నచ్చకపోవడంతో పార్వతి నాయర్ రిజెక్ట్ చేశారట. ఇటీవల ఓ సోషల్ మీడియా చాట్ లో పాల్గొన్న పార్వతి నాయర్ ని ఓ నెటిజెన్ ఈ ప్రశ్న అడిగారు. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాల కారణంగా అర్జున్ రెడ్డి రిజెక్ట్ చేశారట.


ఒక్క నిర్ణయం సామాన్యులను స్టార్స్ ని చేస్తుంది. ఎవరి కెరీర్ అయినా ఎంచుకునే చిత్రాలపైనే ఆధారపడి ఉంటుంది. విజయ్ దేవరకొండ వద్దకు కొత్త డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా అర్జున్ రెడ్డి అనే కంప్లీట్ డిఫరెంట్ లవ్ స్టోరీతో వచ్చారు. అప్పటికి ఎటువంటి ఫేమ్ లేని విజయ్ దేవరకొండ ఆ సినిమాను ఓకె చేశారు. అర్జున్ రెడ్డి సినిమా సంచలన విజయం నమోదు చేసుకొని, విజయ్ ని స్టార్ ని చేసింది. 


విజయ్ దేవరకొండను ఓవర్ నైట్ స్టార్ ని చేసిన అర్జున్ రెడ్డి మూవీలో హీరోయిన్ గా షాలిని పాండే నటించారు. ఆ మూవీతో వచ్చిన ఫేమ్ తో షాలిని సైతం కొన్ని ఆఫర్స్ దక్కించుకున్నారు. అయితే అర్జున్ రెడ్డి మూవీలో హీరోయిన్ పాత్ర కోసం మొదట మలయాళీ నటి పార్వతి నాయర్ ని అనుకున్నారట. సందీప్ రెడ్డి వంగా స్క్రిప్ట్ ఆమెకే నేరేట్ చేశాడట. 


అయితే అర్జున్ రెడ్డి కథ నచ్చకపోవడంతో పార్వతి నాయర్ రిజెక్ట్ చేశారట. ఇటీవల ఓ సోషల్ మీడియా చాట్ లో పాల్గొన్న పార్వతి నాయర్ ని ఓ నెటిజెన్ ఈ ప్రశ్న అడిగారు. ముద్దు సన్నివేశాలు, రొమాంటిక్ సన్నివేశాల కారణంగా అర్జున్ రెడ్డి రిజెక్ట్ చేశారట. అంత పెద్ద హిట్ మూవీ చేజార్చుకున్నందుకు బాధపడుతున్నారా? అని అడుగగా.. అర్జున్ రెడ్డి మూవీ మంచి చిత్రం. ఆ సినిమా అవకాశం వదులుకున్నంతకు నిజంగా బాధగా ఉందని పార్వతి నాయర్ తెలిపారు. పార్వతి నాయర్ మలయాళ, కన్నడ, తమిళ్ బాషలలో అనేక చిత్రాలలో హీరోయిన్ గ నటించారు. 

click me!