నాకు పెళ్లైంది అని చెప్పి షాక్ ఇచ్చిన హీరోయిన్

By Satish ReddyFirst Published Oct 7, 2020, 12:28 AM IST
Highlights

యంగ్ హీరోయిన్ నీతి టేలర్ వివాహం చేసుకున్నారట. ఆమె వివాహం జరిగిన రెండు నెలలు అవుతుండగా ఎన్నాళ్ల తరువాత నీతి తన పెళ్ళికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో షేర్  చేశారు. 

బుల్లితెర ద్వారా నటిగా పరిచయమైన నీతి టేలర్ తెలుగులో మాత్రం హీరోయిన్ గా అవకాశాలు దక్కించుకుంది. మేము వయసుకు వచ్చాం, పెళ్లి పుస్తకం చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటించారు. హీరోయిన్ గా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో అవకాశాలు రాలేదు. దీనితో ఆమె నటనకు ఫుల్ స్టాప్ పెట్టారు. నీతి టేలర్ వెండితెరపై కనిపించి చాలా కాలం అవుతుంది. ఐతే ఈ హీరోయిన్ ఓ షాకింగ్ వీడియోతో వార్తలలో నిలిచింది. 

ఈమె తనకు పెళ్లి జరిగిన విషయం బాగా లేటుగా తెలియజేసింది. దాదాపు రెండు నెలల తరువాత తన పెళ్లి విషయం సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. దీనితో నీతి టేలర్ పెళ్లి చేసుకుందా అని షాక్ తినడం ఫ్యాన్స్ వంతు అయ్యింది. 'కుమారి నుండి శ్రీమతిగా నా ప్రయాణం ముగిసింది. నా శ్రేయోభిలాషులకు, ఫ్యాన్స్ కి నా పెళ్లి గురించి తెలియజేయాలి అనుకుంటున్నాను. ఆగస్టు 13, 2020న పరీక్షిత్ తో నా వివాహం జరిగింది. కోవిడ్ నేపథ్యంలో కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా మా వివాహం జరిగింది' అని పోస్ట్ చేశారు. 

తన పెళ్లిలో భర్త పరీక్షిత్ మరియు కుటుంబ సభ్యులతో ఆమె గడిపిన ఆనంద క్షణాలను ఆమె పంచుకున్నారు. ఒక హీరోయిన్ పెళ్లి విషయం రెండు నెలల వరకు తెలియక పోవడం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నీతి టేలర్ పెళ్లి విషయం ఎవరికీ తెలియకుండా ఇంత రహస్యంగా ఎలా దాచారని అందరూ వింతగా చెప్పుకుంటున్నారు. 
 

click me!