పవన్, బన్నీ చిత్రాల గురించి నేను అలా అనలేదు...వక్రీకరించారు

Published : Oct 06, 2020, 11:14 PM IST
పవన్, బన్నీ చిత్రాల గురించి నేను అలా అనలేదు...వక్రీకరించారు

సారాంశం

ఓ నేషనల్ మీడియాకు హీరోయిన్ శృతి హాసన్ ఇంటర్వ్యూ ఇవ్వగా, ఆమె చెప్పిన వార్తలు వక్రీకరించినట్లు శృతి హాసన్ ఓ పోస్ట్ పెట్టారు. సోషల్ మీడియా ద్వారా ఆమె స్పందించారు.   

ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను చెప్పిన వ్యాఖ్యలు తెలుగు మీడియా వక్రీకరించినట్లు శృతి హాసన్ సోషల్ మీడియా వేదిక తెలియజేశారు. వార్తలలో వస్తున్నట్లుగా తాను అలాంటి ఆరోపణలు చేయలేదని ఆమె వివరణ ఇచ్చారు. రేసు గుఱ్ఱం, గబ్బర్ సింగ్ చిత్రాలు తన కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చాయని, ఆ చిత్రాలలో నటించడం గురించి తాను అభ్యంతర వ్యాఖ్యలు చేయలేదని ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

ప్రస్తుతం ఈ పోస్ట్ ఇప్పుడు ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఐతే శృతి హాసన్ కి అందరూ మద్దతుగా నిలవడం విశేషం. ముఖ్యంగా పవన్ అభిమానులు, అల్లు అర్జున్ అభిమానులు ఈ పోస్ట్ కి రియాక్ట్ అవుతున్నారు. పవన్ సరసన మరోమారు శృతి హాసన్ ని చూడాలని కోరుకుంటున్నారు. శృతి గబ్బర్ సింగ్ తో పాటు కాటమరాయుడు మూవీలో పవన్ ఇక జంటగా నటించింది. 

గబ్బర్ సింగ్ బ్లాక్ బస్టర్ కాగా, కాటమరాయుడు మిశ్రమ ఫలితం అందుకుంది. ముచ్చటగా మూడోసారి శృతి హాసన్, పవన్ వకీల్ సాబ్ మూవీలో జతకట్టనున్నారు. ఈ మూవీలో శ్రుతిది కేవలం క్యామియో రోల్ మాత్రమే. పవన్ తో ఆమెకు ఒకటి రెండు సన్నివేశాలతో పాటు ఒక పాట ఉంటుంది. కనిపించేది కొంతసేపే అయినా పవన్ ఫ్యాన్స్ కి మాత్రం ఈ కాంబినేషన్ పై మంచి ఆసక్తి నెలకొనివుంది. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్
ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?