
కెరీర్ స్పీడ్ పెంచాడు టాలీవుడ్ యంగ్ స్టార్ నిఖిల్. ఏకంగా పాన్ ఇండియాను టార్గెట్ చేశాడు. ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ చేస్తున్న హీరో.. మరో కొత్త సినిమా పోస్టర్ తో సందడి చేస్తున్నాడు.
నిఖిల్ హీరోగా గారీ దర్శకత్వంలో ఓ స్పై థ్రిల్లర్ సినిమా తెరకెక్కనుంది. గతేడాదే ఈ సినిమాకి సంబంధించి నిఖిల్ అనౌన్స్‌మెంట్‌ను సోషల్ మీడియాలో ఇచ్చాడు. అయితే కరోనా వల్ల ఇప్పటి వరకు ఈ సినిమాపై ఎలాంటి అప్‌డేట్ రాలేదు. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్‌డేట్‌ను ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
నిఖిల్ సిద్ధార్ధ్ నటిస్తున్న 19వ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. గూడఛారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బి.హెచ్ డైరెక్షన్ లో నిఖిల్ ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి అప్ డేట్ ను వదిలారు మేకర్స్. ఈ సినిమాకు స్పై అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.
ఇందులో నిఖిల్ గన్ చేతపట్టుకుని బుల్లెట్ల మధ్యలో నడుచుకుంటూ వస్తున్నాడు. ఈడీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఇదే ఏడాది దసరాకు స్పైను రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ టీమ్.
ఈ పోస్టర్ కు ముందే మరో పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఆదివారం ఉదయం 11.11 నిమిషాలకు విడుదల చేయనున్నట్లు మేకర్స్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. గన్స్, బుల్లెట్లు, రూట్ మ్యాప్‌లు ఉన్న ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐశ్వర్య మీనన్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈమూవీ షూటింగ్ ను సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేయబోతున్నారు.