Vishwak Sen: బెంజ్ లో టాప్ ఎండ్... అత్యంత ఖరీదైన కారు కొన్న హీరో విశ్వక్ సేన్! 

Published : May 18, 2022, 03:40 PM ISTUpdated : May 18, 2022, 03:42 PM IST
Vishwak Sen: బెంజ్ లో టాప్ ఎండ్... అత్యంత ఖరీదైన కారు కొన్న హీరో విశ్వక్ సేన్! 

సారాంశం

యంగ్ హీరో విశ్వక్ సేన్ అత్యంత ఖరీదైన కారును కొనుగోలు చేశారు. కోట్లు విలువ చేసే కారు సొంతం చేసుకున్న విశ్వక్ రేంజ్ చూసి ఫ్యాన్స్ మైండ్ బ్లాక్ అయ్యింది. అశోక వనంలో అర్జున కళ్యాణంతో సక్సెస్ కొట్టిన విశ్వక్ కారు కొనడం విశేషంగా మారింది.   

విశ్వక్ సేన్ (Vishwak Sen) లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ వైరల్ గా మారింది. ఆయన తన కొత్త కారు ఫోటోలు ఫ్యాన్స్ తో పంచుకున్నారు. కొత్త కారు అంటే ఏదో ఆషామాషీ కారు కాదు. లగ్జరీ బ్రాండ్ బెంజ్ లో కూడా టాప్ ఎండ్ మోడల్స్ లో ఒకదానిని సొంతం చేసుకున్నాడు. గతంలో విశ్వక్ సేన్ రేంజ్ రోవర్ కారును కొన్నాడు. తాజాగా బెంజ్ కారు సొంతం చేసుకున్నాడు. లేటెస్ట్ మోడల్‌ అయిన మెర్సిడెజ్ బెంజ్ జి వేగన్ 2022 కొన్నాడు. ఇక ఈ కారు ధర చూస్తే మైండ్ బ్లాక్ కావాల్సిందే. ఈ మోడల్ రేంజ్ 2. 5 కోట్ల నుంచి రూ. 3 కోట్ల వరకూ ఉంది.  కోట్ల విలువ చేసే కారు సొంతం చేసుకున్న విశ్వక్ తన రేంజ్ ఏమిటో ఫ్యాన్స్ కి తెలియజేశారు. 

నా డ్రీం కార్ సొంతం చేసుకున్నాను. ఇదంతా మీ ప్రేమ, అభిమానం వలనే సాధ్యమైంది. అందరికీ కృతజ్ఞతలు అంటూ... ఓ ఎమోషనల్ నోట్ పంచుకున్నారు.  ఇక విశ్వక్ సేన్ కొత్త కారుపై చిత్ర ప్రముఖులు, ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. కంగ్రాట్స్ చెబుతూనే, విశ్వక్ ని పార్టీ అడుగుతున్నారు. పట్టుమని పది సినిమాలు చేయని విశ్వక్ సేన్.. ఇంత ఖరీదైన కారు కొనడం గొప్పే. 

విశ్వక్ లేటెస్ట్ మూవీ అశోకవనంలో అర్జున కళ్యాణం మే 6న విడుదలై హాట్ టాక్ సొంతం చేసుకుంది. కాగా ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా విశ్వక్ ఫ్రాంక్ వీడియో చేశారు. ఇది వివాదాస్పదమైంది. ఈ క్రమంలో టీవీ9 యాంకర్ దేవి నాగవల్లితో విశ్వక్ సేన్ కి గొడవ జరిగింది. ఓ వారం రోజుల పాటు విశ్వక్ వివాదం మీడియాలో హాట్ టాపిక్ మారింది. అయితే పలువురు చిత్ర ప్రముఖులు విశ్వక్ తప్పేమీ లేదంటూ ఆయనకు అండగా నిలిచారు. 

PREV
click me!

Recommended Stories

Sanjana Remuneration : విన్నర్ రేంజ్ లో పారితోషికం అందుకున్న సంజన గల్రానీ, 15 వారాలు బిగ్ బాస్ హౌస్ లో ఉన్నందుకు ఎంత ఇచ్చారంటే?
Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి