Kangana Ranaut: కంగనాకు శాపనార్థాలు పెట్టిన నటి... కారణం ఏంటంటే?

Published : May 18, 2022, 02:56 PM IST
Kangana Ranaut: కంగనాకు శాపనార్థాలు పెట్టిన నటి... కారణం ఏంటంటే?

సారాంశం

లాక్ అప్ షో విన్నర్ ఎంపిక విషయంలో తనకు అన్యాయం జరిగిందని నటి పాయల్ రోహత్గి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. దీనికి కారణమైన కంగనాపై ఆమె తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. పాయల్  సోషల్ మీడియా పోస్ట్ వైరల్ గా మారింది.

లాక్ అప్ (Lock Upp Show) పేరుతో బిగ్ బాస్ షోని పోలిన ఓ రియాలిటీ షో ఓటీటీలో ప్రసారమైన విషయం తెలిసిందే. కంగనా హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో బోల్డ్ కంటెంట్ తో సాగింది. కంటెస్టెంట్స్ మానసికంగా, శారీరకంగా బాగా కష్టపడ్డారని చెప్పాలి. లాక్ అప్ షో ఫైనల్ కి పాయల్ రోహత్గి, మునావర్ ఫరూఖీ వెళ్లారు. చివరికి టైటిల్ విన్నర్ గా మునావర్ ఫరూఖీని కంగనా ప్రకటించింది. అయితే మొదటి నుండి పాయల్ రోహత్గి (Payal Rohatgi షో విన్నర్ అవుతారంటూ ప్రచారం జరిగింది. కాగా పాయల్ సైతం విన్నర్ కావాల్సిన తనకు అన్యాయం జరిగినట్లు వాపోతున్నారు. 

ఈ క్రమంలో పాయల్ ఓ సుదీర్ఘ సందేశం పోస్ట్ చేశారు... ‘నిజానికి ఆట ఆడకుండా, కాలు మీద కాలు వేసుకుని కూర్చున్న వ్యక్తి విన్నర్‌ అవ్వడమే ఈ లాకప్‌ షో థీమ్‌ అనుకుంట. అలాంటి వారి కోసమే ఈ షోను పెట్టారు. అయితే లాకప్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌ జరిగే వారానికి ముందు కంగనా అర్పిత ఖాన్‌ ఈద్‌ పార్టీలో పాల్గొన్న కంగనాకు బిగ్‌బాస్‌ హోస్ట్‌ సల్మాన్‌తో మంచి పరిచయం ఏర్పడింది. అప్పుడే తాను లాకప్‌ విన్నర్‌ ఎవరనేది నిర్ణయించుకుంది. అందుకే వారికి సంబంధించిన వారినే లాకప్‌ షో విన్నర్‌గా ప్రకటించుకున్నారు’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. 

ఇక విన్నర్‌ మునావర్‌ ఫరూఖీ గురించి మాట్లాడుతూ.. ‘పెళ్లై పిల్లలు ఉన్న అతడు షోలో మరో అమ్మాయితో రొమాన్స్‌ చేశాడు. అంతేకాదు అతడు మిగత ప్లేయర్స్‌ను కూడా మెంటల్‌గా అటాక్‌ చేశాడు. ఇక ఆ పనిపాట లేని సెలబ్రెటీలు ఇది చూసి నిజం అనుకున్నారు. ఇది వారికి వినోదంగా అనిపించేందోమో. కానీ వారందరిని చూస్తుంటే నాకిప్పుడు బాధేస్తోంది’ అంటూ పాయల్‌ వ్యంగ్య వ్యాఖ్యలు చేసింది. 

ఈద్ సందర్భంగా సల్మాన్ ఖాన్ (Salman Khan)సిస్టర్ అర్పిత ఖాన్ ఇచ్చిన పార్టీకి కంగనా రనౌత్ హాజరయ్యారు. అక్కడ ఆమె సల్మాన్ ఖాన్ ని కలిశారు. అప్పుడే విన్నర్ ఎవరనేది నిర్ణయించారు. నేను నటి కంగనాను అన్‌ఫాలో చేస్తున్నాను. అంతేకాదు తన సినిమాలన్ని ఫ్లాప్‌ అవ్వాలని కోరుకుంటున్నానంటూ షాకింగ్‌ కామెంట్స్‌ చేసింది పాయల్‌. సల్మాన్ సూచనల మేరకు కంగనా (Kangana Ranaut)తనని కాదని మునావర్ ని విజేతను చేశారని ఆమె ఆరోపిస్తున్నారు. మరి పాయల్ ఆరోపణల నేపథ్యంలో కంగనా ఎలా స్పందిస్తారో చూడాలి. పాయల్ లేటెస్ట్ మూవీ ధాకడ్(Dhaakad) మే 20న విడుదల కానుంది. 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Remuneration: కళ్యాణ్ పడాల పారితోషికం, ప్రైజ్ మనీ ఎంత? విజేతకు అందే కళ్లు చెదిరే బహుమతులు ఏవో తెలుసా?
Sanjjanaa Galrani: తన హీరోయిన్ సంజనకే ఝలక్ ఇచ్చిన శ్రీకాంత్.. ఎలా ఎలిమినేట్ చేశాడో తెలుసా ?