స్టార్ ప్రొడ్యూసర్ పై కేసు పెట్టిన హీరో విశాల్!

Published : Jun 10, 2021, 03:43 PM IST
స్టార్ ప్రొడ్యూసర్ పై కేసు పెట్టిన హీరో విశాల్!

సారాంశం

2018లో విడుదలైన ఇరుంబుతిరమ్ తెలుగులో అభిమన్యుడు గా విడుదలైంది. ఈ సినిమాను విశాల్ తన ఓన్ బ్యానర్ విశాల్ ఫ్యాక్టరీలోనే నిర్మించాడు. అయితే ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ ఆర్బీ చౌదరి వద్ద విశాల్ అప్పు తీసుకున్నారట. 


తెలుగు కుటుంబానికి చెందిన హీరో విశాల్ ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో ఉంటారు. తాజాగా విశాల్ స్టార్ నిర్మాత ఆర్బీ చౌదరిపై పోలీసు కంప్లైంట్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన ట్వీట్ చేయడం జరిగింది.  ఆర్బీ చౌదరిపై హీరో విశాల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన తన డాక్యుమెంట్లను తిరిగి ఇవ్వకపోవడం వల్లే చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు విశాల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు.

2018లో విడుదలైన ఇరుంబుతిరమ్ తెలుగులో అభిమన్యుడు గా విడుదలైంది. ఈ సినిమాను విశాల్ తన ఓన్ బ్యానర్ విశాల్ ఫ్యాక్టరీలోనే నిర్మించాడు. అయితే ప్రముఖ నిర్మాత, ఫైనాన్షియర్ ఆర్బీ చౌదరి వద్ద విశాల్ అప్పు తీసుకున్నారట. అప్పుకు హామీగా చెక్ లు, బాండ్లు, ప్రామిసరీ నోట్లను విశాల్ ఇచ్చారట.  ఇక అప్పు మొత్తం తీర్చినప్పటికీ తన పత్రాలు ఇవ్వకుండా ఆర్బీ చౌదరి తిప్పించుకుంటున్నాడని అసహనం వ్యక్తం చేస్తూ విశాల్ ఇప్పుడు చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తెలుగులో ఆర్బీ చౌదరి స్టార్ హీరోలతో అనేక హిట్ సినిమాలు తెరకెక్కించారు. ఆయన ఇద్దరు కుమారులు హీరోలుగా మారగా రంగం ఫేమ్ జీవా తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడే. విశాల్ ఆర్బీ చౌదరిపై పిర్యాదు చేయడం కోలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం విశాల్ ఎనిమీ అనే చిత్రంతో పాటు తుప్పరివాలన్ 2 చిత్రాలలో నటిస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం