మురళీధరన్ బయోపిక్ నుండి తప్పుకున్న విజయ్ సేతుపతి...పంతం నెగ్గించుకున్న తమిళులు

By team teluguFirst Published Oct 20, 2020, 8:52 AM IST
Highlights

ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటించాడన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళ ప్రజలు తమ పంతాన్ని నెగ్గించుకున్నారు. ఒత్తిడి తలొగ్గిన మురళీధరన్, విజయ్ సేతుపతి ఈ ప్రాజెక్ట్ కి తెరదింపారు.

శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ బయోపిక్  తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగాయి. 800 అనే టైటిల్ తో తెరకెక్కనున్న ఈ మూవీలో మురళీధరన్ పాత్రను విజయ్ సేతుపతి చేయడాని తమిళ రాజకీయ పార్టీలు మరియు ప్రజలు వ్యతిరేకించారు. నటుడు భారతీరాజా సైతం విజయ్ సేతుపతి ఈ బయోపిక్ నుండి తప్పుకోవాలని కోరడం జరిగింది. శ్రీలంకలో జరిగిన సివిల్ వార్ లో లక్షలాది మంది తమిళులు మరణించగా...వారి మరణాలను మురళీధరన్ సెలెబ్రేట్ చేసుకున్నారనే కారణంగా ఈ బయోపిక్ లో విజయ్ సేతుపతి నటించడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. 

దీనిపై క్రికెటర్ మురళీధరన్ వివరణ ఇవ్వడం జరిగింది. 2009లో యుద్ధం ముగియడం వలన ప్రజల చావులకు తెరపడిందన్న అర్థంలో నేను సివిల్ వార్ ముగియడం ఆనందగా ఉంది అన్నాను అన్నారు. అంతే కానీ తమిళుల మరణాలు నాకు సంతోషాన్ని కలిగించాయనే అర్థంలో కాదని వివరణ ఇచ్చారు. ఐనప్పటికీ తమిళ ప్రజలు శాంతిచలేదు. 

దీనితో తన బయోపిక్ కారణంగా ఒక స్టార్ హీరో కెరీర్ ఇబ్బందుల్లో పడడం ఇష్టం లేదని...అందుకే తానే స్వయంగా విజయ్ సేతుపతి బయోపిక్ నుండి తప్పుకోవాలని సూచించినట్లు మీడియాకు వెల్లడించారు. మురళీధరన్ నిర్ణయాన్ని గౌరవిస్తూ 800 మూవీ నుండి తప్పుకుంటున్నట్లు విజయ్ సేతుపతి చెప్పినట్లు తెలుస్తుంది. దీనితో ఓ క్రేజీ ప్రాజెక్ట్ కి తెరపడింది. 

click me!