కరోనా సరిపోదా? రకుల్‌ప్రీత్ ప్రశ్న

Surya Prakash   | Asianet News
Published : Oct 20, 2020, 08:17 AM ISTUpdated : Oct 20, 2020, 08:28 AM IST
కరోనా సరిపోదా?  రకుల్‌ప్రీత్ ప్రశ్న

సారాంశం

డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణను ఎదుర్కొన్న స్టార్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఆమె తిరిగి సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు. అందు నిమిత్తం ముంబయి నుంచి హైదరాబాద్‌ వచ్చారు.


రీసెంట్ గా డ్రగ్స్‌ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో విచారణను ఎదుర్కొన్న స్టార్ రకుల్‌ప్రీత్‌ సింగ్‌. ఆమె తిరిగి సినిమా షూటింగ్‌కు హాజరయ్యారు. అందు నిమిత్తం ముంబయి నుంచి హైదరాబాద్‌ వచ్చారు. క్రిష్‌ దర్శకత్వం వహిస్తున్న ఓ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. రకుల్‌ ఇందులో వ్యవసాయం చేసే పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నారట. వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సన్నపురెడ్డి వెంకట రామిరెడ్డి నవల ‘కొండపొలం’ ఆధారంగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు ప్రచారం ఉంది. 

ఇక ఈ సినిమా సెట్‌లో తీసిన వీడియోను రకుల్‌ సోషల్ ‌మీడియాలో షేర్‌ చేశారు. వర్షం కురుస్తున్నా షూటింగ్‌ ఆగలేదన్నారు. ‘వికారాబాద్‌లోని రాతి కొండలపై షూట్‌ చేస్తుండగా వర్షం మొదలైంది. వర్షం నుంచి కెమెరాలను కాపాడుకుంటున్నాం. కొవిడ్‌-19 సమస్యతో ఓ పక్క మనం ఇబ్బందిపడుతుంటే.. హైదరాబాద్‌లో భారీ వర్షాలు మరో అడ్డంకిగా మారాయి’ అని ఆమె పేర్కొన్నారు. వర్షంలోనూ చిత్ర టీమ్ సీన్ షూటి్ చేయటం ఆ వీడియోలో కనిపించింది.
 
ఇక రకుల్‌..నాగ్ సరసన ‘మన్మథుడు 2’లో గత ఏడాది తెలుగు తెరపై కనిపించారు. ఆ తర్వాత హిందీ ప్రాజెక్టులతో బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆమె  కమల్‌ హాసన్‌ నటిస్తున్న ‘భారతీయుడు 2’లో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇందులో కాజల్‌, సిద్ధార్థ్‌ కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెలిసిందే. 
 

PREV
click me!

Recommended Stories

Vijay Sangeetha Case: ఇంట్లోకి రానివ్వట్లేదు, ఆస్తిలో సగం నాదే.. భర్త విజయ్‌పై సంగీత కొత్త పిటిషన్!
Mad for Each Other: బిగ్‌ బాస్‌ ని దెబ్బకొట్టే రియాలిటీ షో వస్తోంది.. మొత్తం మసాలా.. లవర్స్ కి మాత్రం పండగే