హీరోగా వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ, మరి రవితేజ సినిమా నుంచి తప్పుకున్నాడా..?

Published : Jun 08, 2022, 01:58 PM IST
హీరోగా వేణు తొట్టెంపూడి రీ ఎంట్రీ, మరి రవితేజ సినిమా నుంచి తప్పుకున్నాడా..?

సారాంశం

మరోసారి సిల్వర్ స్క్రీన్ పై మెరుపులు మెరిపించడానికి రెడీ అయ్యాడు  కామెడీ హీరో వెణు తొట్టెంపూడి. అయితే ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నారా..? క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా..?  అని తెలియక కన్ ఫ్యూజన్ లోపడ్డారు ఆడియన్స్.   

 ఒకప్పుడు హీరోగా బాగా పేరు తెచ్చుకున్న వారు చాలా మంది... ఆ తర్వాత కాలంలో తెరమరుగయ్యారు. అలాంటి వారి లిస్ట్ చాలానే ఉంది. అందులో వేణు తొట్టెంపూడి ఒకరు.  సక్సెస్ లేక  కొందరు, ఆఫర్స్ అందుకోలేక మరికొందరు సినిమాలకు దూరమయ్యారు ఇందులో  హీరో తొట్టెంపూడి వేణు మొదటి ఆప్షన్ కు చెందినవాడు. అవకాశాలు వస్తున్న సక్సెస్ లు తగ్గడంతో వేణు సినిమాలకు దూరం అయ్యాడు. 

 టాలీవుడ్ లో ఒకప్పుడు మంచి హిట్స్ తో జోరుమీద ఉన్నవేణు వరుసగా స్వయంవరం , చిరునవ్వుతో , కళ్యాణరాముడు , పెళ్ళాం ఊరెళితే , చెప్పవే చిరుగాలి లాంటి సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు వేణు. హనుమాన్ జంక్షన్ , కళ్యాణ రాముడు లాంటి సినిమాల్లో వేణు కామెడీ అద్భుతంగా వర్కౌట్ అయ్యింది. అటు కామెడీ రోల్స్.. ఇటు సీరియస్ రోల్స్ వేణు పండించి సత్తా చాటుకున్నాడు. అయితే ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లో  హీరోగా నటించినప్పటికీ వేణుకి కాలం కలిసిరాలేదు. ఆరడుగులకు పైగా హైటుతో మంచి పర్సనాలిటీతో హీరో మెటీరియల్ అనిపించుకున్న వేణు.. హీరోగా నటించిన ఆఖరి సినిమా రామాచారి .. వీడో పెద్ద గూఢచారి.

ఈ సినిమా కంటే ముందు  వేణు  మధ్యలో యన్టీఆర్ దమ్ము సినిమాతో కేరక్టర్ ఆర్టిస్ట్ గా మారాడు. ఆ సినిమా ఫ్లాప్‌తో వేణుకు ఆ తర్వాత అంతగా ఆఫర్స్ దక్కలేదు. అయితే  ప్రస్తుతం ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇస్తున్న వేణు  రవితేజ రామారావు ఆన్ డ్యూటీ మూవీలో కీలక పాత్రలో నటిస్తున్నాడు.  అయితే వేణు ఇక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా  రీ ఎంట్రీ ఇస్తున్నాడు.. ఇక ముందు కూడా అవే చేస్తాడు అనుకున్న టైమ్ లో.. తాజాగా వేణు హీరోగా ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేసుకున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. 

ఛాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ బ్యానర్ పై అనురాగ్, శరత్  నిర్మించబోతున్న ఈ సినిమాతో సూర్య  అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడని తెలుస్తోంది. . ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళబోతున్నట్టు సమాచారం. ఈ సినిమాను కొద్దిరోజుల్లో అఫీషియల్ గా అనౌన్స్ చేయాలని చూస్తున్నారు. మరి లాంగ్ గ్యాప్ తో మళ్ళీ హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న వేణు ఈ సినిమాలో  ఏ స్థాయిలో సక్సెస్ అందుకుంటాడో చూడాలి

PREV
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్