బావకి వెల్‌కమ్ చెప్పిన వరుణ్‌తేజ్‌.. ఏమన్నాడో తెలుసా?

Published : Aug 14, 2020, 01:30 PM ISTUpdated : Aug 14, 2020, 02:36 PM IST
బావకి వెల్‌కమ్ చెప్పిన వరుణ్‌తేజ్‌.. ఏమన్నాడో తెలుసా?

సారాంశం

తనకు కాబోయే బావకి హీరో వరుణ్‌ తేజ్‌ స్వాగతం పలికారు. `ఈ రోజు జరిగింది. నా బేబీ సిస్టర్‌ ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. ఫ్యామిలీలోకి స్వాగతం బావా` అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా నిహారిక, చైతన్యల ఎంగేజ్‌మెంట్‌ ఫోటోని పంచుకున్నారు. 

నటుడు నాగబాబు ముద్దుల తనయ, హీరో వరుణ్‌ తేజ్‌ బేబీ సిస్టర్‌ నిహారిక ఎంగేజ్‌మెంట్‌ వెంకట చైతన్యతో గురువారం పరిమిత అతిథులతో వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తనకు  కాబోయే బావకి హీరో వరుణ్‌ తేజ్‌ స్వాగతం పలికారు. `ఈ రోజు జరిగింది. నా బేబీ సిస్టర్‌ ఎంగేజ్‌మెంట్‌ అయ్యింది. ఫ్యామిలీలోకి స్వాగతం బావా` అంటూ ట్వీట్‌ చేశారు. ఈ సందర్భంగా నిహారిక, చైతన్యల ఎంగేజ్‌మెంట్‌ ఫోటోని పంచుకున్నారు. 

మరోవైపు నాగబాబు సైతం కాబోయే అల్లుడికి ఆత్మీయ స్వాగతం పలికారు. `డియర్‌ చై.. దాదాపు అన్ని విషయాల్లో తను అచ్చం నాలాగే ఉంటుందని అంతా అంటూ ఉంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమనంతా నువ్వు తనపై కురిపిస్తావనని నమ్ముతున్నా` అంటూ చైతన్యకి స్వాగతం పలుకుతూ, ` ఈ రోజు నుంచి తను అధికారికంగా నీ సమస్యగా మారిపోయింది` అని సరదాగా ట్వీట్‌ చేశారు. మరోవైపు చైతన్య వైపు ఫ్యామిలీ మెంబర్స్ సైతం నిహారికని వారి కుటుంబంలోకి స్వాగతం పలికారు. 

గుంటూరుకి చెందిన పోలీస్‌ అధికారి కుమారుడు వెంకట చైతన్య. గురువారం జరిగిన ఎంగేజ్‌మెంట్‌ కార్యక్రమంలో చిరంజీవి, సురేఖ, రామ్‌చరణ్‌, ఉపాసన, అల్లు అర్జున్‌, సాయిధరమ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌ తోపాటు అతికొద్ది మంది బంధువులు పాల్గొన్నారు. ఇందులో పవన్‌ కళ్యాణ్‌ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన వ్రతంలో ఉండటం వల్ల రాలేకపోయినట్టు తెలుస్తుంది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి