మహేష్ కత్తి అరెస్ట్‌.. రాముడిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసు

Published : Aug 14, 2020, 01:19 PM ISTUpdated : Aug 14, 2020, 01:25 PM IST
మహేష్ కత్తి అరెస్ట్‌.. రాముడిపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో కేసు

సారాంశం

 శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యల నేపధ్యంలో నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయన్న అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. తన అరెస్ట్ విషయాన్ని కత్తి మహేష్ స్వయంగా ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు.

వివాదాస్పద సినీ విశ్లేషకుడు మహేష్ కత్తిని సీసీఎస్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాముడిపై అనుచిత వ్యాఖ్యల నేపధ్యంలో నమోదైన కేసు విచారణలో భాగంగా ఆయన్ను అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఐపీసీ సెక్షన్‌ 154 కమ్యూనల్‌ యాక్ట్‌ కింది ఈ కేసు నమోదైంది. తన అరెస్ట్ విషయాన్ని కత్తి మహేష్ స్వయంగా ఫేస్‌బుక్‌ ద్వారా వెల్లడించారు.

`ఈ ఏడాది ఫిబ్రవరిలో నమోదైన కంప్లయింట్‌లో భాగంగా సైబర్‌ పోలీసులు ఈ రోజు ఉదయం నన్ను అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిన ఓ మీటింగ్‌ (బహుజన మీటింగ్‌)లో రామాయణంలో రాముడి పాత్రపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అరెస్ట్ చేశారు.

నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది ఫిబ్రవరి 14న ఐమాక్స్ థియేటర్‌ దగ్గర నా మీద ఫిజికల్ ఎటాక్‌కు ప్రయత్నించి సందర్భంగా నమోదైన కేసు విషయంలో పోలీసులు ఏం చేస్తున్నారు. ఈ దేశంలో మతపరమైన నమ్మకాలు, ప్రాణాలు తీసే బెదిరింపుల కన్నా ఎక్కువ ఇంపార్టెంట్` అంటూ కామెంట్ చేశాడు కత్తి మహేష్‌.

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 10: ఝాన్సీ వల్ల బాటమ్ లోకి షాలిని, రోహిత్.. ఇరగదీసిన నరేష్, రామ్ ప్రసాద్
Ranabaali Trailer: రణబాలి ట్రైలర్ రివ్యూ.. బ్రిటిష్‌పై వీర పోరాటం, విజయ్ దేవరకొండ ఊచకోత చూశారా