ప్రభుదేవా కొత్త చిత్రం తెలుగు టైటిల్ పై ఓ రేంజిలో ట్రోలింగ్

Published : Aug 02, 2023, 01:31 PM IST
 ప్రభుదేవా కొత్త చిత్రం తెలుగు టైటిల్ పై ఓ రేంజిలో ట్రోలింగ్

సారాంశం

ఇటీవ‌లి కాలంలో ప్రభుదేవా ద‌ర్శ‌కుడిగా విఫ‌లం అవుతూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న డైరెక్ష‌న్స్‌కి గుడ్ చెప్పి న‌టుడిగా కొన‌సాగాల‌ని అనుకుంటున్నారు

ఒక టైమ్ లో డాన్సర్ గా, ఆ తర్వాత డైరెక్ష‌న్‌, కొరియోగ్ర‌ఫీ ఎలా ఇక్కడకు వెళ్లినా సక్సెస్ అవుతు ముందుకు వెళ్తున్న ప్రభుదేవా హవా ఈ మధ్యన  తగ్గిందనే చెప్పాలి. కొత్త నీరు రావటం, కుటుంబ భాధ్యతలుపై ఫోక‌స్ పెడుతోన్న ఆయ‌న యాక్టింగ్‌కే ఎక్కువ‌గా ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు. ప్ర‌స్తుతం ప్ర‌భుదేవా వూల్ఫ్ పేరుతో ఓ పాన్ ఇండియ‌న్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా కొత్త పోస్ట‌ర్‌ను బుధ‌వారం రిలీజ్‌ చేశారు.

టైటిల్ అనువాద లోపాలతో  ఫస్ట్ లుక్ పోస్టర్ పై వుల్ఫ‌గా ప‌డింది. చూసుకున్నారో లేక అనవరసరం అనుకున్నారో కానీ దర్శక,నిర్మాతలు అలాగే టైటిల్ పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్ట‌ర్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. అనేక మంది  ఈ మూవీ టైటిల్‌ను ట్రోల్ చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు. తెలుగులో వుల్ఫ అంటే వేస్ట్ గాడు అనే అర్దంలో వాడుతారు. అది పుట్టించుకోకుండా గూగుల్  ట్రాన్స్‌లేట్ చేయ‌డం ఏమిట‌ని కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక టైటిల్‌ తో పాన్ ఇండియాని గెలుద్దామనుకున్న  మేక‌ర్స్ డేడికేష‌న్ ఎలా ఉందో అర్థ‌మైపోయింద‌ని అంటూ  కామెంట్స్ చేస్తున్నారు.

 ప్ర‌భుదేవా హీరోగా న‌టిస్తోన్న 60వ సినిమా ఇది. ఈ సినిమాకు విను వెంక‌టేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాలో రాయ్‌ల‌క్ష్మి, అన‌సూయ భ‌ర‌ద్వాజ్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. సూప‌ర్ నాచుర‌ల్ హార‌ర్ క‌థాంశంతో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంతోపాటు త‌మిళంలో ఫ్లాష్‌బ్యాక్ అనే సినిమా చేస్తున్నాడుప్ర‌భుదేవా. ఇందులోనూ అన‌సూయ కీల‌క పాత్ర పోషించటం  విశేషం.

అలాగే 'కాదలన్‌'   టైటిల్‌తో తెరకెక్కుతున్న చిత్రంలో ప్రభుదేవా హీరోగా నటించనున్నారు. దీనికి 'పాట్టు అడి.. ఆట్టం.. రిపీట్‌' అనే ట్యాగ్‌ను పెట్టారు. ఇందులో వేదిక హీరోయిన్‌గా నటించ నున్నారు. చాలా గ్యాప్‌ తరువాత ఈమె తమిళంలో నటిస్తున్న చిత్రమిది. వివేక్‌ ప్రసన్న, భగవతి పెరుమాళ్‌, రమేశ్‌ తిలక్‌ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించనున్నారు. మలయాళ దర్శకుడు ఎస్‌జే.శీను ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని బ్లూహిల్స్‌ ఫిలింస్‌ పతాకంపై జోబీ పి.శ్యామ్‌ నిర్మిస్తున్నారు.  

కోరియోగ్రఫర్‌‌‌గా సినీ కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత నటుడుగా మారి దర్శకుడిగా సత్తా చాటాడు ప్రభుదేవా. 2005లో నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో దర్శకుడిగా మారిన ప్రభుదేవ ఈ సినిమాతో మంచి మార్కులు సంపాదించాడు. ఆ తర్వాత పౌర్ణమి, శంకర్ దాదా జిందాబాద్ చిత్రాలకి దర్శకత్వం వహించారు. తెలుగులో సూపర్ హిట్ అయిన పోకిరి సినిమాను హిందీ, తమిళ భాషల్లో రీమేక్‌ చేసి భారీ హిట్ కొట్టాడు. ఇటీవ‌లి కాలంలో ప్రభుదేవా ద‌ర్శ‌కుడిగా విఫ‌లం అవుతూ వ‌స్తున్నాడు. ఈ క్ర‌మంలో ఆయ‌న డైరెక్ష‌న్స్‌కి గుడ్ చెప్పి న‌టుడిగా కొన‌సాగాల‌ని అనుకుంటున్నారట‌. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా