
ఏపీ మంత్రి అంబటి రాంబాబు, పవన్ కళ్యాణ్ ల మధ్య వివాదం ఇప్పుడిప్పుడే ముగిసేలా లేదు. ఈ వివాదం ఎంతదాకా వెళ్లిందంటే ఈ చిత్రానికి రచన చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ కు డైరెక్ట్ గా వార్నింగ్ ఇచ్చే స్దాయిలో. ఓ అధికార పార్టీకి చెందిన మంత్రి అయిన అంబటి రాంబాబు ఇలా ప్రెస్ మీట్ పెట్టి మరీ స్పందించడం చూస్తే బ్రోలో శ్యామ్ బాబు క్యారెక్టర్ కి ఆయన బాగా హర్ట్ అయినట్టు సులభంగా అర్థమైపోయింది. ఇప్పటికే బ్రో సినిమాలో తనను పోలిన క్యారెక్టర్ పెట్టి.. శునకానందం పొందుతున్నాడని పవన్ పై ఫైర్ అయిన రాంబాబు.. తాజాగా మరోసారి పవన్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. తాను సైతం పవన్ పై సినిమా చేయటానికి కథను,టైటిల్ ని సిద్దం చేసానని అన్నారు.
మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. పవన్ తో తీయబోయే సినిమా పేరు మ్రో. ఆ పేరు పెట్టడానికి రీసన్ కూడా ఉంది. మ్యారేజెస్, రిలేషన్స్-అఫెండర్ ఈ రెండు కలిపి మ్రో అని పెట్టే ఆలోచన ఉంది. ఆ సినిమా స్టొరీ ఎలా ఉండబోతుందంటే.. ఓ మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న చిన్న కుటుంబంలో ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు. వారిలో పెద్దవారు ఇద్దరు అద్భుతమైన విజయాలు సాధించి సెలబ్రిటీలుగా ఎదుగుతారు. కానీ.. మూడో వ్యక్తి మాత్రం ఎక్కడికెళ్లినా ఊగిపోతూ ఉపన్యాసాలు ఇస్తుంటాడు. అయితే.. ఆ మూడో వ్యక్తి పెళ్లిళ్ల గురించి మేం తీయబోయే సినిమాలో చూపిస్తాము. క్లైమాక్స్ లో మాత్రం మహిళా లోకం మెచ్చుకునే గుణపాఠం ఒకటి చూపిస్తాం” అంటూ డైరెక్ట్ గా సెటైర్స్ వేశారు.
తాజాగా ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి త్రివిక్రమ్ కు వార్నింగ్ ఇచ్చారు. అలాగే పవన్ కళ్యాణ్‌ను పెళ్లిళ్లు అంటూ కొంచెం గట్టిగానే టార్గెట్ చేశారు. బ్రో సినిమా డిజాస్టర్ అంటూ ఈ సినిమా కలెక్షన్ల వివరాలను ప్రెస్ మీట్లో ఆయన చదవారు. పనిలో పనిగా.. బ్రో సినిమా నిర్మాత టీజీ విశ్వప్రసాద్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారు. “ఆయనొక ఎన్నారై. అమెరికా నుంచి పవన్‌కు వస్తున్న డబ్బు పెద్ద స్కాం. పవన్‌కు ఇవ్వాల్సిన ప్యాకేజీని చంద్రబాబు ముఠా ఇలా తన మనిషి విశ్వప్రసాద్ ద్వారా అందిస్తున్నాడు” అని అంబటి కామెంట్స్ చేసారు.