కేఏ పాల్ గా సునీల్, కేక పెట్టిస్తాడుగా..!

By AN TeluguFirst Published Jun 26, 2019, 9:46 AM IST
Highlights

కేఏ పాల్  మొన్న ఎలక్షన్స్ సమయంలో  ఓ పెద్ద ఎంటర్‌టైనర్ . నాకంతా తెలుసు, ప్రపంచం మొత్తం నా కనుసన్నల్లో నడుస్తుందనే  చెప్తూంటారీ పాస్టర్.  

కేఏ పాల్ మొన్న ఎలక్షన్స్ సమయంలో  ఓ పెద్ద ఎంటర్‌టైనర్ . నాకంతా తెలుసు, ప్రపంచం మొత్తం నా కనుసన్నల్లో నడుస్తుందనే  చెప్తూంటారీ పాస్టర్.  తాను పాతికేళ్ల వాడిలా కనిపిస్తానని, ట్రంప్, బుష్ తో పరిచయాలని, ఇలా ఏదోదో మాట్లాడేస్తూంటారు. అయితే ఆ మాటలతోనే ఆయనకు ఓ రేంజిలో క్రేజ్ వచ్చింది. 

ఇప్పుడు తెలుగు వాళ్లంతా గుర్తు పట్టే స్టేజీకు వచ్చారు. యూట్యూబ్ లో ఆయన వీడియోలకు వచ్చే డిమాండ్ అంతా ఇంతా కాదు. దాంతో ఇలాంటి వింత క్యారక్టర్ పై సినిమా వాళ్ల దృష్టి పడింది.  ఎన్నికల్లో విచిత్ర వేషాలతో ఓటర్లను ఆకట్టుకున్న కిలారీ ఆనంద్ పాల్ లాగా తెరపై కనపించి ఆయన్ని ప్యారెడీ చేయాలని ఫిక్స్ అయ్యారు. అందుకు సునీల్ ని ఎంచుకున్నట్లు సమాచారం.

సునీల్ సైతం ఈ పాత్రకు ఉత్సాహంగా ఉన్నారట. అయితే సినిమాలో హీరోగా సునీల్ చేత ఈ పాత్ర చేయిస్తారా లేక ఓ పాత్రగా సునీల్ ఈ గెటప్ లో కనిపిస్తారో చూడాలి. అలాగే బ్రతికి ఉన్న వ్యక్తుల లైవ్ పాత్రలు చేయాలంటే ముందు వారి నుంచి ఫర్మిషన్ తీసుకోవాలి. మరి కేఏ పాల్ ఇస్తాడా లేదో చూడాలి. ఇక ఈ ప్రాజెక్టుని ఓ దర్శకుడు డైరక్ట్ చేస్తారట. సునీల్ ఇప్పుడు హీరో నుంచి మళ్లీ వెనక్కి వచ్చి క్యారక్టర్ ఆర్టిస్ట్ వేషాలు వేస్తూ బిజీ అవుతున్నాడు. 

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాతో పాటు రవితేజ డిస్కోరాజా సినిమాలో కూడా సునీల్ నటిస్తున్నాడు.ఇక మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ కాంబోలో రానున్న సినిమాలో కూడా సునీల్ కీలక కమెడియన్ రోల్ చేయడానికి ఒప్పుకున్నాడు. వీటితో పాటు మరో రెండు బడా ప్రాజెక్టులను సునీల్ ఒకే చేసినట్లు తెలుస్తోంది. 

click me!