
యంగ్ హీరో నిఖిల్ కెరీర్ లో కాస్త వెనక పడ్డారేమో కానీ మంచి మనస్సుతో జనాలకు సేవ చేసే విషయంలో మాత్రం చాలా మంది కన్నా ముందున్నారు. ఆయన భీమవరంకు చెందిన 300 మంది చిన్నాల చదువుకు అయ్యే పూర్తి ఖర్చు భరిస్తానని మంగళవారం ట్విటర్‌లో పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థులతో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశారు. దాంతో ఆయన్ని మీడియా,సినిమావాళ్లే కాక సామాన్యులు సైతం మెచ్చుకుంటున్నారు. నిఖిల్ భవిష్యత్ లో ఇలాంటి మంచి పనులు మరిన్ని చేయాలని కోరుకుంటున్నారు.
‘భీమవరానికి చెందిన ఈ 300 మంది చిన్నారులు పాఠశాలకు వెళ్లడం నుంచి చదువు పూర్తయ్యే వరకూ అన్నీ బాధ్యతలు చూసుకుంటా. ఈ గొప్ప పనిలో నాకు భాగస్వామ్యం కల్పించిన మహేందర్, రాంబాబుకు ధన్యవాదాలు. భవిష్యత్తులో మరికొందరు చిన్నారుల అభివృద్ధికి తోడ్పతా’ అని నిఖిల్ ట్వీట్ చేశారు.
నిఖిల్ సినిమాల విషయానకి వస్తే...నిఖిల్ ‘కిర్రాక్ పార్టీ’ తర్వాత ‘అర్జున్ సురవరం’ సినిమాలో నటించారు. టీఎన్ సంతోష్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్. ఈ సినిమా రకరకాల కారణాలతో రిలీజ్ కాలేకపోయిందిది. దీని తర్వాత నిఖిల్ ‘కార్తికేయ 2’లో నటించబోతున్నారు. దీనికి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మించనుంది. జూన్ 1న నిఖిల్ పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని చిత్రయూనిట్ ప్రకటించింది.