బిచ్చగాడు ఆఫర్ అలా చేజారింది... హీరో శ్రీకాంత్ ఆవేదన!

By Sambi ReddyFirst Published Apr 25, 2023, 3:57 PM IST
Highlights


బిచ్చగాడు మూవీ ఒక పెద్ద సెన్సేషన్. ఈ మూవీలో నేను నటించాల్సిందని శ్రీకాంత్ కామెంట్స్ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

చెప్పాలంటే హీరో శ్రీకాంత్ కెరీర్ ఒడిదుడుకులతో సాగుతుంది. హీరోగా ఆయన కెరీర్ ముగిసింది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ కావాలని చూస్తున్నారు. శ్రీకాంత్ కెరీర్ బిగినింగ్ లో విలన్ రోల్స్ చేశారు. 1995 నుండి ఆయన హీరోగా సక్సెస్ అయ్యారు. 'ఆమె' తర్వాత తాజ్ మహల్, పెళ్లి సందడి చిత్రాలు హీరోగా నిలబెట్టాయి. ఓ దశాబ్దం పాటు హీరోగా సక్సెస్ ఫుల్ కెరీర్ అనుభవించారు. అయితే మెల్లగా కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. ఇటీవల ఎక్కువగా విలన్ రోల్స్ చేస్తున్నారు. 

2016లో విడుదలైన బిచ్చగాడు డబుల్ బ్లాక్ బస్టర్. కాగా బిచ్చగాడు మూవీలో తాను నటించాల్సి ఉంది, కొన్ని కారణాలతో ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదని శ్రీకాంత్ లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. బిచ్చగాడు తెలుగు వెర్షన్ శ్రీకాంత్ చేద్దామనుకున్నారట. మహాత్మ చిత్రానికి విజయ్ ఆంటోని మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేశాడట. ఆ సమయంలో శ్రీకాంత్ తో పరిచయం ఏర్పడిందట. ఇద్దరి మధ్య స్నేహం కుదిరిన నేపథ్యంలో బిచ్చగాడు చిత్రాన్ని శ్రీకాంత్ తెలుగులో రీమేక్ చేద్దామని అన్నారట. అందుకు నిర్మాత చదలవాడ తిరుపతిరావును కూడా కలిశారట. 

Latest Videos

శ్రీకాంత్ ఇమేజ్ కి సరిపోయేలా మదర్ సెంటిమెంట్ ఇంకొంచెం పెంచి తెరకెక్కించాలనుకున్నారట. అయితే బడ్జెట్ లెక్కలు చూశాక నిర్మాత వెనక్కి తగ్గారట. దాంతో బిచ్చగాడు చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసే ప్రణాళిక కార్యరూపం దాల్చలేదట. ఒకవేళ శ్రీకాంత్ ఆ మూవీ చేసి ఉంటే ఆయన కెరీర్ మలుపు తిరిగేదేమో అని కొందరి వాదన. రీమేక్ చేయడం కుదరకపోవడంతో, అదే నిర్మాత తెలుగులో బిచ్చగాడు డబ్బింగ్ చేసి విడుదల చేసి కోట్ల లాభాలు పొందారు. 

బిచ్చగాడు చిత్రానికి శశి దర్శకుడు. ఆంటోని నటించి, నిర్మించారు. మ్యూజిక్ కూడా ఆయన సమకూర్చారు. ప్రస్తుతం బిచ్చగాడు 2 తెరకెక్కుతుంది. ఈ చిత్ర షూటింగ్ లో విజయ్ ఆంటోని ప్రమాదానికి గురయ్యారు. ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సక్సెస్ఫుల్ సిరీస్ మీద పరిశ్రమలో మంచి అంచనాలు ఉన్నాయి. అయితే సీక్వెల్ కి శశిని పక్కన పెట్టి తానే దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

click me!