Balagam Movie: నీ మొహానికి హీరోయిన్ అవుతావా అన్నారు... బలగం సౌధామిని కి ఆఫర్ ఎలా వచ్చిందంటే!

Published : Apr 25, 2023, 03:00 PM ISTUpdated : Apr 25, 2023, 03:18 PM IST
Balagam Movie: నీ మొహానికి హీరోయిన్ అవుతావా అన్నారు... బలగం సౌధామిని కి ఆఫర్ ఎలా వచ్చిందంటే!

సారాంశం

బలగం మూవీ సక్సెస్ నేపథ్యంలో ప్రతి ఆర్టిస్ట్ నేమ్ మారుమ్రోగుతుంది. ఈ చిత్ర నటులను ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా సంస్థలు ఎగబడుతున్నాయి. బలగం మూవీలో చిన్న పాత్ర చేసి కూడా గుర్తింపు తెచ్చుకుంది నటి సౌధామిని.   

బలగం చిత్రంలో ప్రతి సన్నివేశం ఆకట్టుకుంటుంది. గుండెలకు హత్తుకుంటుంది. సహజత్వానికి దగ్గరగా మానవ సంబంధాలను వెండితెరపై ఆవిష్కరించడంలో డైరెక్టర్ వేణు ఎల్దండి సక్సెస్ అయ్యాడు. ఈ మూవీలో హీరో ప్రియదర్శి తాత శవం దగ్గర రొమాన్స్ చేసే సన్నివేశం ఉంది. చావు ఇంట్లో తనకు కాబోయే భార్యకు మర్యాదలు చేయడం ఫన్నీగా ఉంటుంది. ప్రియదర్శిని చేసుకోబోయే అమ్మాయిగా సౌధామిని నటించింది. సౌధామినికి ఇదే మొదటి చిత్రం. బొద్దుగా ఉన్న సౌధామిని ఎక్స్ప్రెషన్స్ నవ్వు తెప్పిస్తాయి. ఒక్క డైలాగ్ కూడా లేకుండా సౌధామిని ఆకట్టుకుంది. 

ఈ సౌధామిని ఓ ఇంటర్వ్యూలో తన వివరాలు వెల్లడించారు. బలగం మూవీలో తనకు ఛాన్స్ ఎలా వచ్చిందో చెప్పుకొచ్చారు. 'ఆడిషన్ కోసం డైరెక్టర్ వేణు ఆఫీస్ కి వెళ్ళాను. ఆయన నన్ను సిగ్గుపడి చూపించమన్నారు. నా పెర్ఫార్మన్స్ చూసి ఓకే చేశారు. నాకు చిన్నప్పటి నుండి నటి కావాలనే ఆశ ఉంది. ఈ పాత్ర కోసం పది కేజీల బరువు పెరిగాను. కేకులు తిని లావయ్యాను. హీరో ప్రియదర్శి మంచి సపోర్ట్ ఇచ్చారు. వేణు కారణంగానే నాకు గుర్తింపు వచ్చింది.సినిమా ఆఫర్స్ కోసం ఒంటరిగా ఎక్కడికెళ్లాలన్నా భయం. అందుకే అన్నయ్యను తోడు తీసుకుపోయేదాన్ని. బలగం చిత్రం చూశాక జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ కాల్ చేశారు. ఆయన మూవీలో నాకు ఛాన్స్ ఇస్తానన్నారు. ఒకప్పుడు నీ ముఖానికి హీరోయిన్ అవుతావా? అని ఎగతాళి చేశారు... అని చెప్పుకొచ్చారు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లో బలగం భారీ విజయం సాధించింది. అమెజాన్ ప్రైమ్ లో సైతం అద్భుతాలు చేస్తుంది. అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుతుంది. ఇప్పటి వరకు 40కి పైగా అంతర్జాతీయ అవార్డులు బలగం మూవీ గెలుచుకుంది. దర్శకుడు వేణు ఎల్దండి ప్రతిభను ప్రతి ఒక్కరూ కొనియాడుతున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ప్రియదర్శికి జంటగా కావ్యా కళ్యాణ్ రామ్ నటించారు. ఇక ఈ చిత్రంలో నటించినవారందరూ అంతకు ముందు పెద్దగా గుర్తింపు లేని నటులే. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss 9: పాపం ఇమ్మాన్యుయల్... టాప్ 3 కూడా మిస్, ఖుషీలో డీమాన్ పవన్
Sanjana Eliminated : బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రేసు నుంచి సంజన ఔట్, నలుగురిలో నెక్స్ట్ ఎలిమినేషన్ ఎవరంటే?