
గత నెలలో స్వర్గీయ నందమూరి తారక రామారావు శతజయంతి వేడుకలు ఘనంగా ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజనీకాంత్ విశిష్ఠ అతిథిగా హాజరయ్యారు. అయితే ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు టిడిపి పార్టీ ఈవెంట్ లాగా జరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ అన్నీ తానై ముందుకు నడిపిస్తున్నారు.
ఈ వేడుక విజయవాడలో జరిగింది. ఇదిలా ఉండగా త్వరలో హైదరాబాద్ కూకట్ పల్లి లో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా భారీ ఈవెంట్ నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ ఈవెంట్ కి తెలుగు దేశం పార్టీ నాయకులతో పాటు టాలీవుడ్ స్టార్ హీరోలు హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక సమాచారం రావలసి ఉంది.
ఇటీవల తెలుగు దేశం పార్టీ ప్రతినిధులు ఈ సభకి జూ. ఎన్టీఆర్ ని ఆహ్వానించారు. అలాగే టాలీవుడ్ నుంచి ఇతర స్టార్ హీరోలని కూడా ఆహ్వానించినట్లు టాక్. ముఖ్యంగా ప్రభాస్, పవన్ కళ్యాణ్ లని ప్రత్యేక అతిథులుగా ఆహ్వానించారని వార్తలు వస్తున్నాయి.
దీనితో నందమూరి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, ప్రభాస్ ఒకే వేదికపై కనిపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో అల్లు అర్జున్, రాంచరణ్ , కన్నడ నుంచి శివరాజ్ కుమార్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఇదే కనుక జరిగితే అభిమానులకు కనుల పండుగే అని అంటున్నారు. తమ అభిమాన హీరోలంతా ఒకే వేదికపై కనిపిస్తే అంతకి మించి కావలసిందేముంది.