
సాయి ధరమ్-పవన్ కళ్యాణ్ కాంబోలో తెరకెక్కిన బ్రో మూవీ విడుదలకు సిద్ధమైంది. జులై 28న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. బ్రో మూవీ విజయం సాధించాలని సాయి ధరమ్ తేజ్ పుణ్యక్షేత్రాలు సందర్శిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ శ్రీకాళహస్తి, కడప అమీన్ పీర్ దర్గాలో ప్రత్యేక పూజలు చేశారు. అమీన్ పీర్ దర్గాలో పూజలు ముగించిన అనంతరం సాయి ధరమ్ తేజ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మీడియా పొలిటికల్ ఎంట్రీ గురించి అడిగారు. మీరు జనసేన తరపున ప్రచారం చేస్తారా? అని అడగ్గా... అవగాహన లేకుండా పాలిటిక్స్ లో రావద్దని మామయ్య పవన్ కళ్యాణ్ చెప్పారు. నాకు సినిమా తప్పితే పాలిటిక్స్ గురించి అంతగా తెలియదు. అయితే నా మద్దతు మామయ్య పవన్ కళ్యాణ్ కి ఎప్పుడూ ఉంటుందని ఆయన వెల్లడించారు. ఇక మామయ్యతో మూవీ చేసిన అనుభవం మాటల్లో వర్ణించలేనని సాయి ధరమ్ తేజ్ చెప్పుకొచ్చారు.
తన పొలిటికల్ ఎంట్రీ ఉండదని చెప్పిన సాయి ధరమ్ తేజ్ మద్దతు మాత్రం ప్రకటించారు. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? లేదా? అనేది భవిష్యత్ లో తేలనుంది. జనసేన ఒంటరిగా బరిలో దిగితే ఆ పార్టీకి మద్దతుగా మెగా హీరోలు ప్రచారం చేసే ఆస్కారం లేకపోలేదు.
ఇక బ్రో చిత్రానికి సముద్రఖని దర్శకుడు. వినోదయ సితం రీమేక్ గా ఇది తెరకెక్కుతుంది. పవన్ కళ్యాణ్ గత చిత్రాలతో పోల్చుకుంటే బజ్ తక్కువగా ఉంది. బిజినెస్ కూడా ఏమంత ఆశాజనకంగా లేదు. ఇటీవల విడుదలైన సాంగ్స్ సైతం నిరాశపరిచాయి. త్రివిక్రమ్ ఈ చిత్రానికి మాటలు, స్క్రీన్ ప్లే అందించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై తెరకెక్కింది.