
2021లో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) బైక్ ప్రమాదానికి గురయ్యారు. తీవ్ర గాయాలపాలైన ఆయన నెలరోజుల పాటు ఆసుపత్రి బెడ్ కే పరిమితమయ్యారు. సాయి ధరమ్ కోలుకోవడానికి నెలల సమయం పట్టింది. పూర్తిగా రికవరీ అయ్యే వరకు సాయి ధరమ్ మీడియా కంటికి కనిపించలేదు. కొద్ది నెలల తర్వాత మెగా హీరోలు అందరూ కలిసి సాయి ధరమ్ కి వెల్కమ్ చెప్పారు. కుటుంబ సభ్యులు అందరూ ఆయన చేత కేక్ కట్ చేయించి, లోకానికి పరిచయం చేశారు. తర్వాత కూడా సాయి ధరమ్ బయట కనిపించడం మానేశారు. షూటింగ్స్ కూడా లేకపోవడంతో ఇంటికే పరిమితం అవుతున్నారు.
సోషల్ మీడియాలో ట్వీట్స్, పోస్ట్స్ మినగాయిస్తే సాయి ధరమ్ చాలా వరకు అజ్ఞాతంలోనే ఉంటున్నారు. కాగా విక్రమ్ (Vikram) మూవీ సక్సెస్ నేపథ్యంలో చిరంజీవి(Chiranjeevi) కమల్ హాసన్, దర్శకుడు లోకేష్ కనకరాజ్ కి ఆయన నివాసంలో పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సల్మాన్ కూడా రావడం జరిగింది. విక్రమ్ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన నితిన్, మెగా హీరోలు వరుణ్ తేజ్ కూడా పాల్గొనడం జరిగింది. చిరు ఇంట్లో జరుగుతున్న ప్రముఖుల పార్టీ కావడంతో సాయి ధరమ్ కూడా హాజరయ్యారు.
ఈ పార్టీకి సంబంధించిన వీడియో చిరంజీవి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సాయి ధరమ్ లేటెస్ట్ లుక్ చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఆయన చాలా సన్నగా మారిపోయారు. ఒకప్పటి గ్లామర్ ఆయనలో లేదు. క్యాప్ ధరించి డీగ్లామర్ గా ఆయన కనిపించారు. సాయి ధరమ్ లేటెస్ట్ లుక్ హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో ఆయన కావాలనే సన్నబడ్డారా? లేక పూర్తిగా కోలుకోలేదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
ఇక సాయి ధరమ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ పరిశీలిస్తే... జులై నెలలో వినోదయ సిత్తం రీమేక్ మొదలుకానునట్లు వార్తలు వస్తున్నాయి. పవన్-సాయి ధరమ్ మల్టీస్టారర్ గా ఇది తెరకెక్కనుంది. దర్శకుడు సముద్ర ఖని తెరకెక్కించనున్నారు. ఈ మూవీలో పవన్ భగవంతుడిగా కనిపించనున్నారు. ఆయన పాత్రకు తక్కువ నిడివి ఉంటుంది. సినిమా మొత్తం ధరమ్ తేజ్ పై నడుస్తుంది. వినోదయ సిత్తం రీమేక్ కొరకు పవన్ కళ్యాణ్(Pawan kalyan)కేవలం 15-20 డేస్ కేటాయించినట్లు తెలుస్తోంది.