హోటల్‌లో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో శ్రద్దా కపూర్‌ సోదరుడు సిద్దాంత్..

Published : Jun 13, 2022, 10:02 AM IST
హోటల్‌లో రేవ్ పార్టీ.. పోలీసుల అదుపులో శ్రద్దా కపూర్‌ సోదరుడు సిద్దాంత్..

సారాంశం

బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ సోదరుడు సిద్దాంత్‌ కపూర్ బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఓ హోటల్‌లో జరిగిన రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో సిద్ధాంత్ కపూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది.

బాలీవుడ్ నటి శ్రద్దా కపూర్ సోదరుడు సిద్దాంత్‌ కపూర్ బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం రాత్రి బెంగళూరులో జరిగిన ఓ హోటల్‌లో జరిగిన రేవ్ పార్టీపై దాడి చేసిన సమయంలో సిద్ధాంత్ కపూర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఏఎన్‌ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. డ్రగ్స్ వినియోగించినట్టుగా తేలిన ఆరుగురిలో సిద్దాంత్‌ కూడా ఉన్నట్టుగా బెంగళూరు పోలీసులు తెలిపినట్టుగా పేర్కొంది. ఇక, పక్కా సమాచారంతో బెంగళూరు పోలీసులు పార్టీ నిర్వహిస్తున్న ఎంజీ రోడ్డులోని ఓ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్‌ సేవించినట్లు అనుమానిస్తున్న వారి నమూనాలను పరీక్షలకు పంపారు. పాజిటివ్‌గా వచ్చిన ఆరుగురిలో సిద్ధాంత్ నమూనా కూడా ఉంది. అదుపులోకి తీసుకున్న ఆరుగురు వ్యక్తులు హోటల్‌లో డ్రగ్స్ సేవించారా లేదా పార్టీకి వచ్చే ముందు తీసుకున్నారా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు.

ఇక, సిద్దాంత్.. షూటౌట్ ఎట్ వదాలా, హసీనా పార్కర్, చెహ్రే వంటి అనేక బాలీవుడ్ సినిమాల్లో నటించాడు. అతను చివరిగా 2020 వెబ్ సిరీస్ Bhaukaalలో కనిపించాడు. ఇందులో అతను చింటూ డేధా పాత్రను పోషించాడు. సిద్ధాంత్ భగత్ భాగ్, Bhool Bhulaiya, ధోల్.. చిత్రాలకు సహాయ దర్శకుడిగా కూడా పనిచేశాడు.

 

ఇదిలా ఉంటే బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత..  విచారించిన డ్రగ్స్ కేసుకు సంబంధించి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ప్రశ్నించిన వారిలో నటీనటులు సారా అలీ ఖాన్, దీపికా పదుకొణెతో పాటు శ్రద్ధా కపూర్ కూడా ఉన్నారు. అయితే.. శ్రద్దా కపూర్‌‌కు వ్యతిరేకంగా గణనీయమైన ఆధారాలను పోలీసులు గుర్తించలేదు. 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 : బాలయ్య అభిమానులకు భారీ షాక్, ఆగిపోయిన అఖండ2 రిలీజ్ , కారణం ఏంటంటే?
Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి