కొందరు కాంట్రవర్సీ చేశారు... నేషనల్ అవార్డ్స్ పై హీరో రానా కామెంట్స్!

Published : Sep 04, 2023, 03:57 PM IST
 కొందరు కాంట్రవర్సీ చేశారు... నేషనల్ అవార్డ్స్ పై హీరో రానా కామెంట్స్!

సారాంశం

సైమా అవార్డ్స్ కి సంబంధించి హైదరాబాద్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రానాను మీడియా జాతీయ అవార్డుల కాంట్రవర్సీ పై మాట్లాడాలని కోరారు. రానా ఆసక్తికర సమాధానం చెప్పారు.   

భారత ప్రభుత్వం నేషనల్ అవార్డ్స్(National Awards) ప్రకటించిన నేపథ్యంలో జై భీమ్(Jai Bheem) చిత్రానికి ఒక్క అవార్డు కూడా రాలేదు. దీనిపై హీరో నానితో పాటు నెటిజెన్స్ అసహనం వ్యక్తం చేశారు. ఓ మంచి సినిమాకు అన్యాయం జరిగిందన్న వాదన తెరపైకి వచ్చింది. హీరో నాని(Nani) ఇంస్టాగ్రామ్ లో జై భీమ్ అని రాసి పక్కన బ్రేకింగ్ హార్ట్ ఎమోజీ పోస్ట్ చేశాడు. పరోక్షంగా జాతీయ అవార్డుల ప్రకటనపై అసహనం బయటపెట్టాడు. ఇక తమిళులైతే పుష్ప చిత్రంలో నటించిన అల్లు అర్జున్ కి ఉత్తమ నటుడు అవార్డు ఇవ్వడాన్ని తప్పుబట్టారు. లాయర్ పాత్ర చేసిన సూర్య(Suriya)కు కాకుండా స్మగ్లర్ పాత్రకు జాతీయ అవార్డు ఇవ్వడమేంటని మండిపడ్డారు. 

ఉత్తమ నటుడు కాకున్నా అసలు జై భీమ్ కి ఏదో ఒక విభాగంలో జాతీయ అవార్డు ఇవ్వాల్సింది. సమాజహితం కోరుతూ సోషల్ సబ్జెక్టుతో తెరకెక్కించిన చిత్రాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి, గౌరవించాలన్న కామెంట్స్ వినిపించాయి. ఈ విమర్శలపై హీరో రానా తాజాగా స్పందించారు. సైమా అవార్డ్స్ కి సంబంధించి హైదరాబాద్ లో ఒక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రానాను మీడియా జాతీయ అవార్డుల కాంట్రవర్సీ పై మాట్లాడాలని కోరారు. 

''సినిమాలు చూడటంలో అందరి దృష్టి కోణం ఒకేలా ఉండదు. మీ అందరికీ నచ్చిన సినిమా నాకు నచ్చకపోవచ్చు. నటుల అభిరుచులు అలానే ఉంటాయి. జై భీమ్ చిత్రానికి కనీసం ఒక అవార్డు వస్తుందని అందరూ భావించారు. కానీ ఆ సినిమాకు ఏ విభాగంలో అవార్డు రాలేదు. దీంతో కొందరు తమ అభిప్రాయం తెలియజేస్తూ ట్వీట్స్ వేశారు. ఈ ట్వీట్స్ ని కొందరు కాంట్రవర్సీగా మార్చారు. అంతే కానీ మా నటుల మధ్య ఎలాంటి వివాదాలు ఉండవు'' అని అన్నారు. 

ఇక వివాదాల సంగతి అటుంచితే ఈసారి జాతీయ అవార్డ్స్ లో తెలుగు సినిమా సత్తా చాటింది. ఏకంగా 11 అవార్డ్స్ కొల్లగొట్టింది. ఆర్ ఆర్ ఆర్ చిత్రానికి 6 అవార్డులు దక్కాయి. పుష్ప ఉత్తమ నటుడు, ఉత్తమ సంగీత దర్శకుడు(పాటలు) విభాగంలో అవార్డ్స్ అందుకుంది. కొండపొలం, ఉప్పెన చిత్రాలు చెరో అవార్డు కైవసం చేసుకున్నాయి. వీటిలో ఉత్తమ నటుడు చాలా ప్రత్యేకం. టాలీవుడ్ చరిత్రలో మొదటిసారి అల్లు అర్జున్(Allu Arjun) జాతీయ ఉత్తమ నటుడు అవార్డు పొందారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: రీతూ కాదు, తనూజ వెంటపడేవాడిని.. షాకిచ్చిన డీమాన్‌ పవన్‌.. బిగ్‌ బాస్‌ ఎమోషనల్‌ జర్నీ
ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి