Chiranjeevi-Charan: ఫాదర్స్ డే... చిరుతో కూడిన అరుదైన ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్ 

Published : Jun 19, 2022, 04:00 PM IST
Chiranjeevi-Charan: ఫాదర్స్ డే... చిరుతో కూడిన అరుదైన ఫోటో షేర్ చేసిన రామ్ చరణ్ 

సారాంశం

చిరంజీవి వారసుడు రామ్ చరణ్ ఫాదర్స్ డే నాడు అరుదైన ఫోటో షేర్ చేశారు. తండ్రి చిరంజీవితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు లవ్ ఎమోజీ పోస్ట్ చేశారు. 

నేడు ఇంటర్నేషనల్ ఫాదర్స్ డే(Fathers Day). చిత్ర ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తమ తండ్రులతో గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ అరుదైన ఫోటోలు షేర్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అందరికీ ఫాదర్స్ డే విషెస్ తెలియజేశారు. ఆయన నాన్నగారైన వెంకట్రావుతో దిగిన ఫోటోలు షేర్ చేశారు. కాగా చిరంజీవి (Chiranjeevi)వారసుడు రామ్ చరణ్ ఫాదర్స్ డే నాడు అరుదైన ఫోటో షేర్ చేశారు. తండ్రి చిరంజీవితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు లవ్ ఎమోజీ పోస్ట్ చేశారు. 

పదేళ్ల ప్రాయంలో ఉన్న చరణ్ (Ram Charan)తో దిగిన చిరంజీవి ప్రత్యేకమైన ఫోటో అది. తండ్రీకొడుకులు స్కై బ్లూ టీ షర్ట్స్ ధరించి ఫోటోకి ఫోజిచ్చారు. ఇక రామ్ చరణ్ షేర్ చేసిన ఆ అరుదైన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కానిస్టేబుల్ వెంకట్రావు కొడుకైన చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగి చిత్రసీమను ఏలారు. చిరు కుమారుడిగా పుట్టిన రామ్ చరణ్ ఆయన లెగసీ ముందుకు తీసుకెళ్తున్నారు. స్టార్ కొడుకుగా పుట్టడం అతిపెద్ద బాధ్యత. ఏమాత్రం అంచనాలు అందుకోలేకపోయినా విమర్శలపాలు కావాల్సి వస్తుంది. 

కెరీర్ బిగినింగ్ లో నటన, లుక్స్ పరంగా చరణ్ కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే పట్టుదలతో ఒక్కొక్క లోపాన్ని అధిగమిస్తూ స్టార్ గా ఎదిగారు. రెండో చిత్రం మగధీరతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన రామ్ చరణ్ రంగస్థలం వంటి చిత్రాల ద్వారా నటుడిగా తానేమిటో నిరూపించుకున్నాడు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీలో చరణ్ నటన అద్భుతం. బలమైన నటుడు ఎన్టీఆర్ (NTR)కి రామ్ చరణ్ గట్టిపోటీ ఇచ్చారు. ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ ఆర్ ఆర్ ఆర్ ఏకంగా రూ. 1100 కోట్లకు పైగా వరల్డ్ వైడ్ గ్రాస్ రాబట్టింది. 

ఆర్ ఆర్ ఆర్ మూవీతో చరణ్ గ్లోబల్ ఇమేజ్ రాబట్టారు. ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ జరుపుకుంటుంది. రామ్ చరణ్ ఈ మూవీలో ట్రిపుల్ రోల్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే కొన్ని లీక్స్ ద్వారా రామ్ చరణ్ డిఫరెంట్ రోల్స్ లో కనిపించనున్నట్లు క్లారిటీ వచ్చింది. ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్నారు. నెక్స్ట్ చరణ్ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో మూవీ ప్రకటించారు. 

PREV
click me!

Recommended Stories

Sobhan Babu రిజెక్ట్ చేసిన సినిమాతో.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హీరో ఎవరు? ఏంటా సినిమా?
Pawan Kalyan కు అభినవ కృష్ణదేవరాయ బిరుదు, ధర్మం, రాజ్యాంగం వేరు కాదన్న పవర్ స్టార్