IND vs NZ: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ సెమీ ఫైనల్... మ్యాచ్ కి స్పెషల్ అట్రాక్షన్ గా రజినీకాంత్!

By Sambi Reddy  |  First Published Nov 15, 2023, 8:20 AM IST

సూపర్ స్టార్ రజినీకాంత్ కి బీసీసీఐ నుండి ప్రత్యేక ఆహ్వానం దక్కింది. నేడు ముంబై వాంఖడే స్టేడియంలో జరిగే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ వరల్డ్ కప్ సెమీఫైనల్ మ్యాచ్ కి ఆయన హాజరవుతున్నారు. 
 


రజినీకాంత్ రేంజ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయనకు ఇండియా వైడ్ అభిమానులున్నారు. ఈ క్రమంలో రజినీకాంత్ కి ఇండియన్ క్రికెట్ బోర్డు బీసీసీఐ ప్రత్యేక గౌరవం ఇచ్చింది. ముంబై వాంఖడే స్టేడియం వేదికగా నేడు జరగనున్న ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ కి ఆహ్వానించింది. ప్రతిష్టాత్మక సెమీ ఫైనల్ వీక్షించేందుకు కొందరు సెలెబ్స్ కి గోల్డెన్ పాస్ లు జారీ చేశారు. ఈ గోల్డెన్ టికెట్ అందుకున్న అతికొద్ది మంది లో రజినీకాంత్ ఒకరు. 

వాంఖడే స్టేడియం లో రజినీకాంత్ స్పెషల్ అట్రాక్షన్ కానున్నారు. నేడు మధ్యాహ్నం 2:00 గంటలకు మ్యాచ్ బిగిన్ అవుతుంది. మ్యాచ్ లో గెలిచిన టీమ్ వరల్డ్ కప్ ఫైనల్ కి వెళుతుంది. గత వరల్డ్ కప్ లో ఇండియాను సెమీస్ లో ఓడించిన న్యూజిలాండ్ ఫైనల్ కి చేరింది. ఈ క్రమంలో న్యూజిలాండ్ పై రివేంజ్ తీర్చుకోవాలని ఇండియన్ టీమ్ పట్టుదలతో ఉంది. 

Latest Videos

undefined

Also Read మనవళ్లతో రజినీకాంత్ దివాళి సెలబ్రేషన్స్, వైరల్ అవుతున్న ఫోటోస్..

మరోవైపు రజినీకాంత్ జైలర్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టారు. రూ. 600 కోట్లకు పైగా వసూళ్లు జైలర్ రాబట్టింది. చాలా గ్యాప్ తర్వాత రజినీకాంత్ కి తన రేంజ్ హిట్ పడింది. ప్రస్తుతం లాల్ సలామ్ మూవీ చేస్తున్నారు. విష్ణు విశాల్ ప్రధాన పాత్ర చేస్తున్న ఈ చిత్రంలో రజినీకాంత్ ది ఎక్స్టెండెడ్ గెస్ట్ రోల్. దర్శకుడు టీజీ జ్ఞానవేల్ తో 170వ చిత్రం చేస్తున్నారు. అలాగే 171వ చిత్రం లోకేష్ కనకరాజ్ తో ప్రకటించారు. 

will watch semi final 1 - vs at the Wankhede Stadium in Mumbai today. Remember was one of the very few who received the prestigious Golden Ticket handed out by . pic.twitter.com/kjNqMI3gMS

— Sreedhar Pillai (@sri50)
click me!