
టాలీవుడ్ సీనియర్ హీరో రాజశేఖర్ కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం రాజశేఖర్ తండ్రి వరదరాజన్ గోపాల్ (93) మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
వరదరాజన్ చెన్నై డీసీపీగా పనిచేసి రిటైర్ అయ్యారు. వరదరాజన్ కు ఐదుగురు సంతానం కాగా అందులో ముగ్గురు కుమారులు ఇద్దరు కుమార్తెలు. Rajasekhar ఆయనకు రెండవ కుమారుడు. వరదరాజన్ మృతితో రాజశేఖర్ ఫ్యామిలిలో విషాదం నెలకొంది.
వరదరాజన్ అంత్యక్రియలని చెన్నైలో నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. దీనికోసం అయన పార్థివ దేహాన్ని శుక్రవారం ఉదయం విమానంలో చెన్నై తరలించనున్నట్లు రాజశేఖర్ కుటుంబ సభ్యులు తెలిపారు.