విఘ్నేష్‌ నా బాయ్‌ఫ్రెండ్‌ స్టేజ్‌ దాటిపోయాడు.. పెళ్లి మాత్రం రహస్యంగా చేసుకోముః నయనతార

Published : Aug 16, 2021, 07:39 AM IST
విఘ్నేష్‌ నా బాయ్‌ఫ్రెండ్‌ స్టేజ్‌ దాటిపోయాడు.. పెళ్లి మాత్రం రహస్యంగా చేసుకోముః నయనతార

సారాంశం

ఆగస్ట్ 15 సందర్బంగా తమిళంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ టాక్‌ షోలో సందడి చేసింది లేడీ సూపర్‌స్టార్‌ నయనతార. ఈ సందర్భంగా అనేక విషయాలను వెల్లడించింది నయనతార. తన వేలికి ఉన్న రింగ్ సీక్రెట్‌ చెప్పేసింది. విఘ్నేష్‌తో పెళ్లి గురించి కూడా రివీల్‌ చేసింది. 

లేడీ సూపర్‌ స్టార్‌ నయనతార తన పెళ్లిపై, ప్రేమపై ఓపెన్‌ అయ్యారు. ఇన్నాళ్లు తమిళ యంగ్‌ డైరెక్టర్‌ విఘ్నేష్‌ శివన్‌తో ఆమె ప్రేమాయణం సాగించారు. అయితే వీరి ప్రేమపై అనేక కథనాలు వచ్చాయి. కానీ ఏనాడూ వీరు నోరు విప్పలేదు. ఫస్ట్ టైమ్‌ నయన్‌ స్పందించింది. అంతేకాదు చాలా రోజుల తర్వాత ఆమె మీడియా ముందుకొచ్చింది. ఆగస్ట్ 15 సందర్బంగా తమిళంలో ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌ టాక్‌ షోలో సందడి చేసింది. 

ఈ సందర్భంగా అనేక విషయాలను వెల్లడించింది నయనతార. తన వేలికి ఉన్న రింగ్ సీక్రెట్‌ చెప్పేసింది. అది విఘ్నేష్‌తో తనకు జరిగిన ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌ అని తెలిపింది. తనకు పెద్దగా సంబరాలు చేసుకోవడం ఇష్టం ఉండదని, అందుకే ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని తెలిపింది. అయితే పెళ్లి మాత్రం సీక్రెట్‌గా చేసుకోబోమని, అందరికి చెప్పే చేసుకుంటామని తెలిపింది. మ్యారేజ్‌ డేట్‌ ఫిక్స్ కాలేదని, ముహూర్తం ఫిక్స్ అయ్యాక వెంటనే తన ఫ్యాన్స్ కి వెల్లడిస్తానని తెలిపింది. 

కెరీర్‌ పరంగా వాళ్లిద్దరికి కొన్ని గోల్స్ ఉన్నాయని, ప్రస్తుతం వాటిని సాధించే పనిలో బిజీగా ఉన్నట్టు చెప్పింది నయనతార. అందుకే పెళ్లిపై ఇప్పటి వరకు సరైన నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది. విఘ్నేష్‌ తనకు బాయ్‌ఫ్రెండ్‌ స్టేజ్‌ దాటిపోయాడని, ఆయన తనకు కాబోయే భర్త అని, ఇకపై మీడియాలో కూడా ఇలానే కథనాలు రాస్తారని ఆశిస్తున్నట్టు తెలిపింది. మొత్తంగా ప్రేమ,పెళ్లిపై బోల్డ్, ఓపెన్‌గా క్లారిటీ ఇచ్చింది నయనతార.

 అయితే కొన్నేళ్లుగా మీడియాకి దూరంగా ఉన్న నయనతార ఫస్ట్ టైమ్‌ ఇలా మీడియా ముందుకు రావడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది. కెరీర్‌లో తను నెక్ట్స్ స్టెప్‌ తీసుకోబోతుందనే సంకేతాలను స్పష్టంగా ఇస్తుంది నయనతార. ఇక ప్రస్తుతం నయనతార `అన్నాత్తే`, కాబోయే భర్త విఘ్నేష్‌ శివన్‌ రూపొందిస్తున్న `కాథు వాకుల రెండు కాదల్‌`, `లూసీఫర్‌` రీమేక్‌,తోపాటు మరో సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. ఇటీవల `నెట్రికన్‌`తో ఆడియెన్స్ ముందుకొచ్చింది.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 : తనూజ తో ఐటమ్ సాంగ్ చేయిస్తానన్న ఇమ్మాన్యుయేల్, అడ్డంగా బుక్కైన డీమాన్ పవన్.. హౌస్ లో చివరి రోజు సందడి
Emmanuel Remuneration: ఇమ్మూ రెమ్యూనరేషన్‌ మైండ్‌ బ్లోయింగ్‌.. బిగ్‌ బాస్‌ తెలుగు 9 షోకి ఎంత తీసుకున్నాడంటే?