వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి గెస్ట్స్ లిస్ట్ లో ఆ టాలీవుడ్ జంట!

Published : Aug 25, 2023, 10:05 PM IST
వరుణ్ తేజ్-లావణ్య పెళ్లి గెస్ట్స్ లిస్ట్ లో ఆ టాలీవుడ్ జంట!

సారాంశం

హీరో వరుణ్ తేజ్ తన పెళ్లిపై కొంత స్పష్టత ఇచ్చారు. పెళ్లి తేదీ ఎప్పుడు ఉండొచ్చో చెప్పేశారు. ఇక గెస్ట్స్ ఎంపిక మొదలుకాగా ఓ  టాలీవుడ్ జంట పేర్లు చేర్చారన్న మాట వినిపిస్తోంది.   

గాండీవధారి అర్జున మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న వరుణ్ తేజ్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. హీరోయిన్ లావణ్య త్రిపాఠితో వరుణ్ కి నిశ్చితార్థం అయ్యింది. ఆగస్టులో వివాహం ఉంటుందని ఊహాగానాలు వినిపించాయి. అయితే పెళ్లి నవంబర్ లేదా డిసెంబర్ లో ఉంటుందని వరుణ్ తేజ్ చెప్పారు. పెళ్లి ఎప్పుడనేది అమ్మ నిర్ణయమే. ఆమె డిసైడ్ చేస్తారని చెప్పారు. 

అలాగే తనది డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పారు. దాదాపు ఇటలీలో వరుణ్ తేజ్ పెళ్లి జరగొచ్చట. మెగా హీరోలు, కుటుంబ సభ్యులు మాత్రమే ఈ పెళ్ళికి హాజరుకానున్నారు. అయితే టాలీవుడ్ ప్రముఖుల్లో అత్యంత సన్నిహితులను పిలుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే గెస్ట్స్ లిస్ట్ ప్రిపేర్ చేస్తున్నారట. వరుణ్ కి సన్నిహితుడైన నితిన్ కి ఆహ్వానం ఉందని అంటున్నారు. నితిన్ భార్య షాలినితో పాటు వరుణ్ తేజ్ వివాహానికి హాజరు కానున్నాడట. 

టాలీవుడ్ వర్గాల్లో ఈ మేరకు ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. ఇక లావణ్యతో ప్రేమ వ్యవహారం మీద కూడా వరుణ్ తేజ్ స్పందించిన విషయం తెలిసిందే. మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయానని వరుణ్ చెప్పాడు. అయితే లావణ్యనే మొదట ప్రపోజ్ చేసిందని చెప్పాడు. వరుణ్, లావణ్య 2017లో మిస్టర్ మూవీ కోసం మొదటిసారి కలిశారు. ఆ చిత్ర సెట్స్ లోనే బంధం కుదిరింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇక వరుణ్ లేటెస్ట్ మూవీ గాండీవధారి అర్జున ఆగస్టు 25న విడుదలైంది. 
 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: తనూజకి షాక్‌.. కళ్యాణ్‌ సీక్రెట్‌ క్రష్‌ బయటపెట్టిన ఇమ్మాన్యుయెల్‌
Dhurandhar Collections: బాక్సాఫీసు వద్ద `ధురంధర్‌` కలెక్షన్ల సునామీ.. తెలుగు ఆడియెన్స్ కి గుడ్‌ న్యూస్‌