చరణ్-అల్లు అర్జున్ మధ్య కోల్డ్..? మరోసారి బయటపడ్డ విబేధాలు!

Published : Aug 25, 2023, 08:18 PM ISTUpdated : Aug 25, 2023, 08:25 PM IST
 చరణ్-అల్లు అర్జున్ మధ్య కోల్డ్..? మరోసారి బయటపడ్డ విబేధాలు!

సారాంశం

మెగా హీరోలైన అల్లు అర్జున్ చరణ్ మధ్య కోల్డ్ నడుస్తుందని సోషల్ మీడియా టాక్. నేషనల్ అవార్డ్స్ ప్రకటన అనంతరం ఏర్పడిన పరిణామాలు దీన్ని బలపరుస్తున్నాయి.   

చిరంజీవి-అల్లు అరవింద్ కుటుంబాల మధ్య దూరం పెరిగిందని కొన్నాళ్లుగా వినిపిస్తున్న మాట. దీన్ని అల్లు అరవింద్ ఒకటి రెండు సందర్భాల్లో ఖండించినా గ్రౌండ్ లెవెల్ లో కోల్డ్ వార్ నడుస్తుందనే వాదన ఉంది. అల్లు అర్జున్ మెగా హీరో అనిపించుకోవడానికి ఇష్టపడటం లేదు. అల్లువారి అబ్బాయిగా, అల్లు రామలింగయ్య మనవడిగా గుర్తింపు తెచ్చుకోవాలని తాపత్రయ పడుతున్నాడు. దీనిలో భాగమే అల్లు అర్జున్ ఆర్మీ, AA అనే సపరేట్ బ్రాండ్ లోగో అంటారు. పుష్ప మూవీలో క్లైమాక్స్ లో 'ఇది సార్ నా బ్రాండ్' అని అల్లు అర్జున్ చెప్పే సన్నివేశం ఉద్దేశం కూడా ఇదే అంటారు. 

ఆ మధ్య చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్ మీటింగ్ లో కీలక పదవిలో ఉన్న ఓ వ్యక్తి అల్లు అర్జున్ ని దూషించాడు. అతడు మెగా ఫ్యామిలీకి, జనసేన పార్టీకి ఏ విధంగా ఉపయోగపడటం లేదు. కాబట్టి అల్లు అర్జున్ కి మన సహకారం ఉండకూడదు. అతడు మెగా హీరో కాదంటూ పరుష వ్యాఖ్యలు చేశాడు. దీనిపై మెగా ఫ్యాన్స్ లోనే వ్యతిరేకత వ్యక్తం కాగా సదరు ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ అల్లు అర్జున్ కి క్షమాపణలు చెప్పాడు. 

హీరోగా ఎదిగే విషయంలో రామ్ చరణ్, అల్లు అర్జున్ పోటీపడుతున్నారు. వీరి మధ్య దూరం పెరిగింది. రామ్ చరణ్ బర్త్ డేకి అల్లు అర్జున్ విష్ చేయలేదు. అల్లు అర్జున్ బర్త్ డే నాడు రామ్ చరణ్ పొడిపొడిగా విష్ చేశాడు. అదే రోజు అఖిల్ పుట్టినరోజు కాగా అఖిల్ తో దిగిన ఫోటో షేర్ చేసి ఆత్మీయంగా ఓ సందేశం పోస్ట్ చేశాడు. చరణ్ విషెస్ కి స్పందించని అల్లు అర్జున్, ఎన్టీఆర్ శుభాకాంక్షలకు రెస్పాండ్ అయ్యాడు. బావా అనుకుంటూ ఇద్దరి మధ్య సరదా సంభాషణలు జరిగాయి. 

ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీతో ఆస్కార్ వేడుకల్లో రామ్ చరణ్ పాల్గొన్నాడు. కొన్ని గ్లోబల్ అవార్డ్స్ అందుకున్నాడు. దానికి ధీటుగా అల్లు అర్జున్ ఇప్పుడు నేషనల్ అవార్డు సాధించి టాలీవుడ్ చరిత్రలో  ఈ ఘనత అందుకున్న మొదటి హీరోగా రికార్డులకు ఎక్కాడు. అల్లు అర్జున్ కి చిత్ర పరిశ్రమతో పాటు మెగా హీరోలందరూ బెస్ట్ విషెస్ తెలియజేశారు. సాయి ధరమ్ తేజ్,  నాగబాబు, వరుణ్ తేజ్ స్వయంగా కలిసి అభినందించారు. రామ్ చరణ్ మాత్రం కనీసం సోషల్ మీడియాలో కూడా స్పందించలేదు. 

ఒకరోజు ఆలస్యంగా ఆగస్టు 25న నేషనల్ అవార్డ్స్ విన్నర్స్ అందరితో పాటు అల్లు అర్జున్ కి శుభాకాంక్షలు చెప్పాడు. తాను నటించిన ఆర్ ఆర్ ఆర్ 6 అవార్డ్స్ గెలవడాన్ని హైలెట్ చేశాడు. అల్లు అర్జున్ ఏదో మొక్కుబడిగా థాంక్యూ అని రిప్లై ఇచ్చాడు. ఈ వరుస పరిణామాలు చూస్తుంటే మెగా-అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగిన మాట వాస్తవమే. ముఖ్యంగా రామ్ చరణ్-అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది. అది వాళ్ళ సోషల్ మీడియా బిహేవియర్ ద్వారా అర్థం అవుతుందని అంటున్నారు. 

గతంలో పవన్ కళ్యాణ్ పేరు చెప్పను అన్నందుకు బన్నీని పవన్ ఫ్యాన్స్ ట్రోల్ చేశారు. డీజే మూవీపై నెగిటివిటీ ప్రచారం చేశారు. ఇప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి వ్యతిరేకంగా పోస్ట్స్ పెడుతుంటారు. ఈ కారణాలతో అల్లు అర్జున్ మెగా హీరో అనిపించుకోవాలని అనుకోవడం లేదని ఇండస్ట్రీ వర్గాల వాదన. అందుకే ఆయన మెగా హీరో బ్రాండ్ నుండి బయటకు రావాలని... ఇమేజ్, మార్కెట్ లో మెగా హీరోలు అందుకోని స్థాయికి ఎదగాలని ప్రయత్నం చేస్తున్నాడనే వాదన ఉంది. 


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: కళ్యాణ్ ని తనూజ నిజంగా లవ్ చేస్తోందా ? సంతోషం పట్టలేక మ్యాటర్ బయటపెట్టేసిందిగా
భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్