పెళ్లయ్యాక వాళ్ళ అవసరం తీరిపోయింది, శాడ్ స్టోరీ చెప్పి బుట్టలో వేసుకున్నాడు... నిఖిల్ వైఫ్ ఆసక్తికర కామెంట్స్

Published : Mar 23, 2023, 05:31 PM IST
పెళ్లయ్యాక వాళ్ళ అవసరం తీరిపోయింది, శాడ్ స్టోరీ చెప్పి బుట్టలో వేసుకున్నాడు... నిఖిల్ వైఫ్ ఆసక్తికర కామెంట్స్

సారాంశం

హీరో నిఖిల్ ని ఉద్దేశిస్తూ భార్య పల్లవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. నాకు శాడ్ స్టోరీ చెప్పి బుట్టలో వేసుకున్నాడని ఆమె వెల్లడించారు. 


స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ వ్యాఖ్యాతగా మారారు. అలా మొదలైంది పేరుతో టాక్ షో స్టార్ట్ చేస్తున్నారు. ఈ షోకి రొమాంటిక్ కపుల్స్ ని గెస్ట్స్ గా పిలవనున్నారు. ఫస్ట్ ఎపిసోడ్ మార్చి 28న ఈటీవీలో ప్రసారం కానుంది. యంగ్ కపుల్ నిఖిల్-పల్లవి గెస్ట్స్ గా వచ్చారు. వీరితో వెన్నెల కిషోర్ సంభాషణ ఆసక్తికరంగా సాగింది. అత్తమామల పేర్లు చెప్పాలని నిఖిల్ ని వెన్నెల కిషోర్ అడిగారు. పల్లవి పేరెంట్స్ పేర్లు చెప్పలేక నిఖిల్ తడబడ్డాడు. దాంతో పల్లవి సెటైర్ వేసింది. పెళ్ళై పోవడంతో వాళ్ళ అవసరం తీరిపోయింది, అందుకే మర్చిపోయాడని ఆమె అన్నారు. 

అనంతరం మీ లవ్ స్టోరీ చెప్పాలని వెన్నెల కిషోర్ అడిగారు. పేరెంట్స్ కి చెప్పిన లవ్ స్టోరీ చెప్పాలా? అసలు జరిగిన లవ్ స్టోరీ చెప్పాలా? అని నిఖిల్ అన్నారు. నిజంగా జరిగింది చెప్పండని కిషోర్ అన్నారు. ఇప్పుడు పేరెంట్స్ చూస్తే ఇబ్బంది కదా, అని నిఖిల్ అనడంతో... చూడరులే అని వెన్నెల కిషోర్ హామీ ఇచ్చారు. అనంతరం పల్లవి మాట్లాడారు. నాకు శాడ్ స్టోరీ చెప్పి పడేశాడు. ఈ అబ్బాయికి ఇన్ని కష్టాలు ఉన్నాయా? అని నేను ఫీలైపోయానంటూ ఆమె చెప్పారు. 

హోస్ట్ వెన్నెల కిషోర్ తో నిఖిల్-పల్లవి దంపతులు పంచుకున్న సరదాగా సంగతులతో కూడిన అలా మొదలైంది ప్రోమో ఆసక్తి రేపుతోంది. వెన్నెల కిషోర్ ఫస్ట్ టైం హోస్ట్ గా మారి ఈ షో చేస్తున్నారు. కాగా ఇటీవల పల్లవి-నిఖిల్ విడిపోతున్నారంటూ ఓ న్యూస్ చక్కర్లు కొట్టింది. ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, విడాకులు తీసుకుంటున్నారనే పుకార్లు వినిపించాయి. ఈ వార్తలను నిఖిల్ తనదైన శైలిలో ఖండించారు. 

2020 స్ట్రిక్ట్ లాక్ డౌన్ సమయంలో నిఖిల్ వివాహం జరిగింది. లాక్ డౌన్ లో పెళ్లి చేసున్న మొదటి హీరో నిఖిల్. తర్వాత రానా,నితిన్ లు చేసుకున్నారు. దీంతో నిఖిల్ పెళ్ళికి అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. నిఖిల్ భార్య పల్లవి వృత్తిరీత్యా డాక్టర్. ఇక కార్తికేయ 2 భారీ విజయం సాధించింది. ప్రస్తుతం ఆయన స్పై టైటిల్ తో యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నారు. ఇది పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. 

PREV
click me!

Recommended Stories

చిరంజీవి ఫ్రెండ్ తో లవ్ ఎఫైర్ పెట్టుకున్న స్టార్ హీరోయిన్ ? పెళ్లి కాకుండా ఒంటరిగా మిగిలిపోయింది
చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?