టైట్ ఫిట్ లో బన్నీ వైఫ్ స్నేహారెడ్డి... జిమ్ లుక్ షేర్ చేయడంతో నెటిజెన్స్ షాక్!

By Sambi ReddyFirst Published Mar 23, 2023, 4:01 PM IST
Highlights


స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తీసిపోని గ్లామర్ అల్లు స్నేహారెడ్డి సొంతం. మరి ఆమె అందం వెనుకున్న సీక్రెట్ తెలియజేస్తూ ఓ ఫోటో షేర్ చేశారు. 
 

అసలు స్నేహారెడ్డి హీరోయిన్ ఎందుకు కాలేదనే సందేహాలు నెటిజెన్స్ వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చి ఉంటే ఇండస్ట్రీని షేక్ చేసేవారంటున్నారు. ఆ రేంజ్ గ్లామర్ ఆమె సొంతం. చక్కని రూపంతో పాటు స్లిమ్ గా ఉంటారు. అంత అందగత్తె కాబట్టే అల్లు అర్జున్ ఆమెకు ఫ్లాట్ అయ్యారు. అల్లు స్నేహారెడ్డి ఒకప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారు కాదు. ఓ ఏడాది కాలంగా ఆమె గ్లామరస్ ఫోటో షూట్స్ చేయడం స్టార్ట్ చేశారు. అలాగే వ్యక్తిగత విషయాలు పంచుకుంటూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. 

దీంతో అల్లు స్నేహారెడ్డి పాపులారిటీ విపరీతంగా పెరిగింది. ఇంస్టాగ్రామ్ లో ఆమెను ఎనిమిది మిలియన్స్ కి పైగా ఫాలో అవుతున్నారు. తాజాగా స్నేహారెడ్డి జిమ్ ఫిట్ లో మిర్రర్ సెల్ఫీ దిగి షేర్ చేశారు. లేటెస్ట్ ఫోటో ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. దీంతో అల్లు స్నేహారెడ్డి ఫిట్నెస్ రహస్యం ఇదా అని కామెంట్స్ చేస్తున్నారు. బ్యూటీ అండ్ హెల్త్ విషయంలో ఆమె చాలా ఖచ్చితంగా ఉంటారు. వ్యాయామం, యోగా చేయడంతో పాటు తాజా ఆహారం తీసుకుంటారు. మానసిక ప్రశాంత కోసం కుటుంబంతో గడుపుతారు. ప్రకృతిని ఆస్వాదిస్తారు. క్రమశిక్షణతో కూడిన అలవాట్లు ఆమెను కాలేజ్ గర్ల్ వలె ఉంచుతున్నాయి. 

కాగా స్నేహారెడ్డిని అల్లు అర్జున్ ప్రేమ వివాహం చేసుకున్నారు. ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా వీరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమకు దారి తీసింది. అయితే స్నేహారెడ్డి ఫాదర్ వీరి పెళ్లికి ఒప్పుకోలేదట. స్నేహారెడ్డి పట్టుబట్టి అల్లు అర్జున్ తో ఏడడుగులు వేశారట. ఇక వీరికి ఇద్దరు సంతానం. అబ్బాయి పేరు అయాన్, అమ్మాయి అర్హ. శాకుంతలం మూవీతో అర్హ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమవుతున్నారు. ఆమె బాలనటిగా నటించారు. శాకుంతలం ఏప్రిల్ 14న విడుదల కానుంది. 

ఇక అల్లు అర్జున్ పుష్ప 2 షూట్లో బిజీగా ఉన్నారు. ఇటీవల చిత్రీకరణ మొదలైంది. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో సీక్వెల్ తెరకెక్కిస్తున్నారని సమాచారం. పలు భాషల్లో విడుదల కానున్న పుష్ప 2 టార్గెట్ రూ. 1000 కోట్లు అట. మరి సుకుమార్-బన్నీ ఏ మేరకు తమ లక్ష్యం చేరుకుంటారో చూడాలి. రష్మిక మందాన హీరోయిన్ గా నటిస్తుండగా... దేవిశ్రీ సంగీతం అందిస్తున్నారు. 
 

click me!