ఆ డాక్టర్లే నా తండ్రిని చంపేశారు..ఎవ్వరినీ వదలా.. నటి సంభావన ఫైర్‌

Published : May 23, 2021, 08:46 PM IST
ఆ డాక్టర్లే నా తండ్రిని చంపేశారు..ఎవ్వరినీ వదలా.. నటి సంభావన ఫైర్‌

సారాంశం

టీవీ నటి సంభావన సేత్‌ డాక్టర్లపై ఫైర్‌ అయ్యారు. తన తండ్రిని ఆ డాక్టర్లే దారుణంగా చంపేశారని వాపోయింది. ఈ మేరకు ఆమె తీవ్ర స్థాయిలో డాక్టర్లపై ఆరోపణలు చేసింది. 

టీవీ నటి సంభావన సేత్‌ డాక్టర్లపై ఫైర్‌ అయ్యారు. తన తండ్రిని ఆ డాక్టర్లే దారుణంగా చంపేశారని వాపోయింది. ఈ మేరకు ఆమె తీవ్ర స్థాయిలో డాక్టర్లపై ఆరోపణలు చేసింది. సంభావన తండ్రి ఇటీవల కరోనాతో కన్నుమూశారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తండ్రి చనిపోయారని ఆమె ఆరోపిస్తుంది. తమ ఫాదర్‌ని అన్యాయంగా పొట్టన పెట్టుకున్నారని, ఆక్సిజన్‌ లెవల్స్ తక్కువగా ఉన్నప్పటికీ వైద్యులు పట్టించుకోలేదని ఈ కారణంగానే ఆయన చనిపోయాడని నటి మండిపడ్డింది. ఎవ్వరినీ వదిలి పెట్టనని హెచ్చరించింది. 

ఈ మేరకు సంభావన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోని పంచుకుంది. ఇందులో ఆమె మాట్లాడుతూ, `డాక్టర్లు దేవుళ్లు కాదు..  వారిలో మనలాంటి వాళ్లను హత్య చేసే రాక్షసులు కూడా ఉన్నారు. వాళ్లే నా తండ్రిని చంపేశారు. తండ్రిని కోల్పోవడం అనేది నా జీవితంలోనే ఓ భయంకరమైన పరిస్థితి. కానీ నేను ఇప్పుడు ధైర్యంగా ముందడుగు వేస్తాను. నా తండ్రి నేర్పిన బాటలోనే న్యాయం కోసం పోరాడుతాను. ఈ పోరాటంలో నేను గెలిచినా గెలవకపోయినా కొందరిని కచ్చితంగా బయటకు లాగి వారి నిజ స్వరూపాన్ని చూపిస్తాను.

నా తండ్రి చావుకు కారణమైన జైపూర్‌ గోల్డెన్‌ ఆస్పత్రికి లీగల్‌ నోటీసులు పంపాం. మీలో చాలామంది ఇలాంటి కష్టాన్ని ఎదుర్కొనే ఉంటారు. కానీ అనేక కారణాల వల్ల వాటిని ఎదురించలేకపోవచ్చు. ఇప్పుడు మాత్రం నా పోరాటానికి మద్దతు తెలపండి` అని అభ్యర్థించింది సంభావన. దీనికి అభిమానులు మద్దతు పలుకుతున్నారు. మీకు అండగా ఉంటామని కామెంట్ల ద్వారా సపోర్ట్ చేస్తున్నారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌
Karthika Deepam 2 Latest Episode: దీపను దారుణంగా అవమానించిన జ్యో- సీరియస్ అయిన శివన్నారాయణ, సుమిత్ర