సిగ్గు పడాల్సిన టైం, బాగా హర్ట్ అయిన హీరో నిఖిల్.. ఏకంగా కేంద్ర మంత్రికి ట్యాగ్ చేస్తూ..

Published : Mar 22, 2024, 10:35 PM ISTUpdated : Mar 22, 2024, 10:36 PM IST
సిగ్గు పడాల్సిన టైం, బాగా హర్ట్ అయిన హీరో నిఖిల్.. ఏకంగా కేంద్ర మంత్రికి ట్యాగ్ చేస్తూ..

సారాంశం

హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాదు పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ని నిలబెట్టుకునేందుకు నిఖిల్ మునుపటి కంటే ఎక్కువగా కష్టపడుతున్నాడు.

హీరో నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాదు పాన్ ఇండియా స్టార్ స్టేటస్ ని నిలబెట్టుకునేందుకు నిఖిల్ మునుపటి కంటే ఎక్కువగా కష్టపడుతున్నాడు. ప్రస్తుతం నిఖిల్ చేస్తున్నవన్నీ పాన్ ఇండియా ప్రాజెక్టులే. స్వయంభు అనే భారీ బడ్జెట్ చిత్రంలో నిఖిల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. 

తాజాగా నిఖిల్ దేశం మొత్తం చర్చ జరిగేలా హాట్ హాట్ గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ప్రతిష్టాత్మకమైన ఫిఫా ఫుడ్ బాల్ వరల్డ్ కప్ క్వాలిఫయర్ మ్యాచులు జరుగుతున్నాయి. టీమిండియా ప్రదర్శన ఆశాజనకంగా లేదు. ఫుట్ బాల్ క్రీడలో ఇండియా ఇంకా వెనుకబడే ఉంది. 

తాజాగా క్వాలిఫయర్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి చండడంతో హీరో నిఖిల్ తీవ్ర నిరాశకి గురయ్యాడు. వెంటనే ఏకంగా ఫుట్ బాల్ అసోసియేషన్ కి, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కి ట్యాగ్ చేస్తూ హాట్ హాట్ గా ట్వీట్ చేశారు. నిఖిల్ ట్వీట్ చేస్తూ.. ఇప్పుడే టీమిండియా క్వాలిఫయర్ మ్యాచ్ చూశాను. చాలా నిరాశగా అనిపించింది. 

ఇండియన్ ఫుట్ బాల్ అసోసియేషన్ సిగ్గు పడాల్సిన సమయం ఇది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశం మనది. ఇంతకంటే మంచి ప్రదర్శన ఇవ్వాల్సింది. ఇండియాలో క్రీడా శాఖని ప్రక్షాళన చేయండి అంటూ నిఖిల్ కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కి ట్యాగ్ చేస్తూ కోరారు. 

నిఖిల్ ట్వీట్ పై నెటిజన్లు స్పందిస్తున్నారు. నిఖిల్ వాదనలో వాస్తవం ఉందని మద్దతు తెలుపుతున్నారు. నిఖిల్ ప్రస్తుతం స్వయంభు కాకుండా రాంచరణ్ నిర్మాణంలో ఇండియా హౌస్ అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. అది కూడా పాన్ ఇండియా చిత్రమే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Rajamouli: ఇక నుంచి రాజమౌళి హాలీవుడ్ డైరెక్టర్, సినిమా పుట్టిన దేశంలో జక్కన్నకు అరుదైన గౌరవం..
Horror thriller OTT: బాక్సాఫీస్‌ను షేక్ చేసిన హారర్ థ్రిల్లర్ మూవీ ఇప్పుడు ఓటీటీలో, కానీ ట్విస్ట్ ఏంటంటే?