శివరాజ్ కుమార్ సినిమాలు బ్యాన్ చేయాలి.. ఈసీకి కంప్లైంట్, ఏం జరిగిందంటే..

Published : Mar 22, 2024, 10:00 PM IST
శివరాజ్ కుమార్ సినిమాలు బ్యాన్ చేయాలి.. ఈసీకి కంప్లైంట్, ఏం జరిగిందంటే..

సారాంశం

ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల హంగామా నెలకొంది. సినీ తారలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఇలా ప్రతి ఒక్కరికి ఎన్నికల వేడి తగులుతోంది. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో భాగం కావలసిందే. 

ప్రస్తుతం దేశం మొత్తం ఎన్నికల హంగామా నెలకొంది. సినీ తారలు, క్రీడాకారులు, వ్యాపారవేత్తలు ఇలా ప్రతి ఒక్కరికి ఎన్నికల వేడి తగులుతోంది. ప్రత్యక్షంగా అయినా పరోక్షంగా అయినా ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో భాగం కావలసిందే. తాజాగా ఎన్నికల సెగ కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ని తాకింది. 

శివరాజ్ కుమార్ సతీమణి గీతా శివరాజ్ కుమార్ కాంగ్రెస్ తరుపున లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. షిమోగా నియోజకవర్గంలో గీతా శివకుమార్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. దీనితో ఆయన తన సతీమణి తరుపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. కన్నడ నాట శివరాజ్ కుమార్ పాపులారిటీ గురించి తెలిసిందే. ఆయనకి విశేష ప్రజాదారణ ఉంది. 

దీనితో ఎన్నికలు పూర్తయ్యే వరకు శివరాజ్ కుమార్ చిత్రాలు, ప్రకటనలు, బిల్ బోర్డు ప్రదర్శనలు నిషేదించాలని బీజేపీ నేతలు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. 

బిజెపి సీనియర్ నేత రఘు శివరాజ్ కుమార్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. శివరాజ్ కుమార్ చిత్రాలు ఎన్నికల సమయంలో ప్రజలపై ప్రభావం చూపుతాయి. అందుకే తాము ఈసీకి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మరి ఎలక్షన్ కమిషన్ ఎలా స్పందిస్తుందో చూడాలి. శివరాజ్ కుమార్.. త్వరలో రాంచరణ్, బుచ్చిబాబు పాన్ ఇండియా చిత్రంలో కీలక పాత్రలో నటించబోతున్న సంగతి తెలిసిందే. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Renu Desai ని రిజెక్ట్ చేసిన తెలుగు స్టార్‌ హీరో ఎవరో తెలుసా? బద్రి కంటే ముందే ఇంత కథ జరిగిందా?
Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే