Nikhil Father Passes Away: హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం... తండ్రి అకాల మరణం!

Published : Apr 28, 2022, 03:24 PM ISTUpdated : Apr 28, 2022, 03:34 PM IST
Nikhil Father Passes Away: హీరో నిఖిల్ ఇంట తీవ్ర విషాదం... తండ్రి అకాల మరణం!

సారాంశం

హీరో నిఖిల్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తండ్రి నేడు తుది శ్వాస విడిచారు. దీంతో నిఖిల్ కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

హీరో నిఖిల్ తండ్రి కావలి శ్యామ్ సిద్ధార్థ్ (Kavali Shyam Siddharth)నేడు కన్నుమూశారు. అనారోగ్యం బారిన పడిన శ్యామ్ సిద్ధార్థ్ ఓ  ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చాలా కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు సమాచారం. నేడు పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. తండ్రి మరణంతో నిఖిల్ (Nikhil)కుటుంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. 

ఇక శ్యామ్ సిద్ధార్థ్ మరణవార్త తెలుసుకున్న పరిశ్రమ వర్గాలు దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మరణం పట్ల చిత్ర పరిశ్రమ ప్రముఖులు, అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు. శ్యామ్ సిద్దార్థ్ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. ప్రస్తుతం నిఖిల్ కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే 'స్పై' టైటిల్ తో ఇటీవల ఓ పాన్ ఇండియా మూవీ ప్రకటించారు. కెరీర్ పరంగా సక్సెస్ ట్రాక్ లో వెళుతున్న నిఖిల్ తండ్రి మరణంతో కృంగిపోతున్నారు. 

PREV
click me!

Recommended Stories

Emmanuel lover ఎవరో తెలుసా? డాక్టర్ ను పెళ్లాడబోతున్న బిగ్ బాస్ 9 టాప్ కంటెస్టెంట్
Bigg Boss telugu 9 బోరుమని ఏడ్చిన రీతూ, బయటకు వెళ్తూ బాంబ్ పేల్చిన కంటెస్టెంట్