
టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva) నుండి వస్తున్న ఐదవ చిత్రం ఆచార్య. రైటర్ గా పలు హిట్ చిత్రాలకు పని చేసిన కొరటాల శివ.. మిర్చి మూవీతో దర్శకుడిగా మారాడు. 2013లో విడుదలైన మిర్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రెండవ చిత్రం మహేష్ తో చేశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు ఇండస్ట్రీ హిట్ అందుకుంది. మహేష్ కెరీర్ లో అతిపెద్ద హిట్ గా శ్రీమంతుడు నిలిచింది. ఎన్టీఆర్ తో చేసిన జనతా గ్యారేజ్, మహేష్ తో రెండవ చిత్రం భరత్ అనే నేను సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి.
కొరటాల శివ ట్రాక్ రికార్డు చూసిన మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi)పిలిచి మరీ ఆఫర్ ఇచ్చారు. అనుకోని కారణాలతో ఆచార్య చాలా ఆలస్యమైంది. ఎట్టకేలకు ఆచార్య అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధమైంది. అయితే ఆచార్య మూవీకి పెద్దగా బజ్ లేదన్న ప్రచారం జరుగుతుంది. కానీ ఆచార్య చిత్రానికి జరిగిన బిజినెస్ చూస్తే అది నిజం కాదనిపిస్తుంది. ఆచార్య వరల్డ్ వైడ్ రికార్డు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. చిరంజీవి కెరీర్ లో సైరా తర్వాత సెకండ్ హైయెస్ట్ బిజినెస్ ఆచార్య జరిపింది.
ఇక ఏరియా వైజ్ గా ఆచార్య థియేట్రికల్ హక్కులు(Acharya Prerelease business) ఎంతకు అమ్ముడు పోయాయంటే. నైజాం లో రూ. 36 కోట్లకు అమ్మారు. సీడెడ్ రూ. 20 కోట్లు, ఉత్తరాంధ్ర 13.5 కోట్లకు అమ్మారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆచార్య రూ. 109 కోట్ల బిజినెస్ చేసింది. రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 11 కోట్లకు , ఓవర్సీస్ మరో రూ. 11 కోట్లకు అమ్మారు. మొత్తంగా రూ. 131 కోట్ల వరల్డ్ వైడ్ బిజినెస్ చేసింది. కాబట్టి ఆచార్య టార్గెట్ రూ. 150 కోట్ల పైమాటే. బుకింగ్స్ పరంగా ఆచార్య అంతగా జోరు చూపలేదు. విడుదల తర్వాత ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.
ఆచార్య మూవీ కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ 29న వరల్డ్ వైడ్ గా విడుదల కానుంది.
ఏరియాల వారీగా ఆచార్య ప్రీ రిలీజ్ బిసినెస్..
నైజాం: 36 కోట్లు
సీడెడ్ :20 కోట్లు
ఉత్తరాంధ్ర :13.5 కోట్లు
గుంటూరు :9.5 కోట్లు
ఈస్ట్ :9.5 కోట్లు
వెస్ట్ :8 కోట్లు
కృష్ణ :8 కోట్లు
నెల్లూరు :4.5 కోట్లు
AP/TS: 109 కోట్లు
ROI :11 కోట్లు
ఓవర్సీస్ :11 కోట్లు
వరల్డ్ వైడ్ గా : రూ. 131 కోట్లు