పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్‌ సిద్ధార్థ్‌.. నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న యంగ్‌ హీరో

Published : Mar 29, 2024, 11:19 PM IST
పాలిటిక్స్ లోకి ఎంట్రీ ఇచ్చిన నిఖిల్‌ సిద్ధార్థ్‌.. నారా లోకేష్‌ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న యంగ్‌ హీరో

సారాంశం

టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఆయన తెలుగు దేశం పార్టీలో చేరారు. తాజాగా నారా లోకేష్‌ సమక్షంలో ఆయన పార్టీ కండువా కప్పుకోవడం విశేషం.   

ఎలక్షన్లు వచ్చిప్పుడు రాజకీయాలు రంజుగా మారతాయి. నాయకులు ఆపార్టీ నుంచి ఈ పార్టీకి షిఫ్ట్ అవుతుంటారు. వేగంగా జంపింగ్‌లు చోటు చేసుకుంటాయి. సినిమా సెలబ్రిటీలు కూడా ఈ ఎన్నికలను క్యాష్‌ చేసుకుని పదువులు పొందే ప్రయత్నం చేస్తుంటారు. ఇది కొన్ని ఏళ్లుగా సాగుతున్నదే. ఇప్పుడు టాలీవుడ్‌ యంగ్‌ హీరో నిఖిల్‌ కూడా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

హీరోగా భారీ సినిమాలతో బిజీగా ఉన్న సిద్ధార్థ్‌.. రాజకీయ రంగ ప్రవేశం చేశారు. త్వరలో ఏపీలో అసెంబ్లీ, అలాగే దేశంలో లోక్‌ సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఆయన టీడీపీ(తెలుగు దేశం పార్టీ)లో చేరడం విశేషం. నారా లోకేష్‌ సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకోవడం విశేషం. ఈ మేరకు లెటెస్ట్ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. హీరోగా బిజీగా ఉన్న నిఖిల్‌ ఈ సడెన్‌ నిర్ణయం చర్చనీయాంశంగా మారుతుంది. 

అయితే ఆయన ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారా? అనేది ఆసక్తికరంగా మారింది. కేవలం ప్రచారం కోసమే ఆయన పార్టీ కండువా కప్పుకున్నానే ప్రచారం కూడా జరుగుతుంది. ఏం జరగబోతుందనేది, నిఖిల్‌ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి కారణం ఏంటనేది త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన, బీజీపీ కలిసి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. 

ఇక ప్రస్తుతం నిఖిల్‌.. `స్వయంభు` చిత్రంలో నటిస్తున్నాడు. భరత్‌ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో సంయుక్త మీనన్‌ హీరోయిన్ నటిస్తుంది. పీరియాడికల్‌ యాక్షన్‌ మూవీగా ఇది తెరకెక్కుతుంది. ఇందులో నిఖిల్‌ యుద్ధ విద్యలు తెలిసిన యోధుడిగా కనిపించబోతున్నట్టు తెలుస్తుంది. అలాగే హీరోయిన్‌ సంయుక్త మీనన్‌ కూడా యాక్షన్‌ చేస్తుంది. ఈ మేరకు ఆమె యుద్ధ విద్యలు కూడా నేర్చుకోవడం విశేషం. భారీ బడ్జెట్‌తో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. దీంతోపాటు ఇటీవల `కార్తికేయ 3`ని కూడా ప్రకటించారు నిఖిల్‌. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Illu Illalu Pillalu Today Episode Dec 10: అమూల్యకు విశ్వ ఉత్తరం.. నర్మద, ప్రేమ చేతికి చేరిన లెటర్
Aishwarya Rai: రెండు కోలుకోలేని తప్పులు చేసిన ఐశ్వర్యా రాయ్‌.. సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్లు మిస్‌