లవ్ మ్యారేజ్ అని కంఫర్మ్ చేసిన విజయ్ దేవరకొండ.. నాకూ పిల్లలు కావాలి, కాకపోతే..

Published : Mar 29, 2024, 05:38 PM IST
లవ్ మ్యారేజ్ అని కంఫర్మ్ చేసిన విజయ్ దేవరకొండ.. నాకూ పిల్లలు కావాలి, కాకపోతే..

సారాంశం

విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.

విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరశురామ్ క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'ఫ్యామిలీ స్టార్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 5న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రీసెంట్ గా విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది. విజయ్ దేవరకొండ ఎప్పటిలాగే తన యాటిట్యూడ్ తో ఆకట్టుకుంటున్నాడు. 

తమిళంలో కూడా ఈ చిత్రం రిలీజ్ కి రెడీ అవుతోంది. దీనితో ఈ చిత్రానికి ప్రమోషన్స్ చేసేందుకు చిత్ర యూనిట్ చెన్నై వెళ్లారు. అక్కడ మీడియా సమావేశంలో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. విజయ్ దేవరకొండ గురించి తరచుగా రూమర్స్ వస్తూనే ఉంటాయి. అలాంటప్పుడు విజయ్ మీడియా ముందుకు వెళితే ఆ ప్రశ్నలే ఎదురవుతాయి. 

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య సంథింగ్ సంథింగ్ అంటూ రూమర్స్ వస్తూనే ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా విజయ్, రష్మిక హింట్స్ ఇస్తూనే ఉన్నారు. అయితే తమిళ మీడియా విజయ్ దేవరకొండ పెళ్లి గురించి ప్రశ్నించింది. ఈ ఏడాది మీరు పెళ్లి చేసుకుంటారా అని ప్రశ్నించారు. 

పెళ్లి తప్పకుండా చేసుకుంటాను.. నాకు కూడా పిల్లలు కావాలి కదా.. కాకపోతే ఈ ఏడాది చేసుకోను అని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. తాను చేసుకోబోయేది లవ్ మ్యారేజే అని కూడా విజయ్ దేవరకొండ కంఫర్మ్ చేశాడు. ఇంట్లో వాళ్ళకి నచ్చిన అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చారు. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ డీప్ లవ్ లో ఉన్నారని మాత్రం ఫ్యాన్స్ భావిస్తున్నారు. 

ఇక ఫ్యామిలీ స్టార్ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ట్రైలర్ లో వీరిద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. గోపీసుందర్ సంగీత దర్శకుడు. దిల్ రాజు ఏ చిత్రాన్ని నిర్మించారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Ustaad Bhagat Singh: ప్రోమోతోనే దుమ్ములేపుతున్న `దేఖ్‌ లేంగే సాలా` సాంగ్‌.. పవన్‌ కళ్యాణ్‌ మేనియా స్టార్ట్
2025 Top 5 Heroes: 1000 కోట్లతో టాప్‌లో ఉన్న నటుడు ఇతనే.. రిషబ్‌, మోహన్‌ లాల్‌, విక్కీ, అక్షయ్‌లకు ఝలక్‌