Nikhil Siddharth: తీవ్రమైన ఆవేదనతో హీరో నిఖిల్ ట్వీట్.. నాలుగు సినిమాలకు సైన్ చేసినప్పటికీ..

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 27, 2022, 05:41 PM ISTUpdated : Jan 27, 2022, 05:47 PM IST
Nikhil Siddharth: తీవ్రమైన ఆవేదనతో హీరో నిఖిల్ ట్వీట్.. నాలుగు సినిమాలకు సైన్ చేసినప్పటికీ..

సారాంశం

యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ లో తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు. యువత మెచ్చే యాటిట్యూడ్ తో, విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు.

యంగ్ హీరో నిఖిల్ టాలీవుడ్ లో తనదైన పంథాలో దూసుకుపోతున్నాడు. యువత మెచ్చే యాటిట్యూడ్ తో, విభిన్నమైన కథలతో నిఖిల్ ప్రేక్షకులని అలరిస్తున్నాడు. ఇదిలా ఉండగా కరోనా మొదలైనప్పటి నుంచి చిత్ర పరిశ్రమ కష్టాలు అన్నీఇన్నీ కావు. 

గ్యాప్ దొరికినప్పుడు పెద్ద చిత్రాలు విడుదలకు రెడీ అయిపోతున్నాయి. మీడియం, చిన్న బడ్జెట్ చిత్రాలకు థియేటర్స్ సమస్య ఎక్కువవుతోంది. ఈ ఎఫెక్ట్ హీరో నిఖిల్ కెరీర్ పై కూడా బాగా పడింది. అర్జున్ సురవరం చిత్రం తర్వాత నిఖిల్ నుంచి మరో చిత్రం రాలేదు. కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కానీ కరోనా కారణంగా విడుదల కాలేని పరిస్థితి. 

నిఖిల్ ట్వీట్ చేస్తూ.. మహమ్మారి కరోనా కెరీర్స్ పై ప్రభావం చూపుతున్న విధానం చాలా బాధాకరంగా ఉంది. అర్జున్ సురవరం సక్సెస్ తర్వాత నేను 4 చిత్రాలకు సైన్ చేశాను. అన్నీ అద్భుతమైన కథలు. ఈ చిత్రాలపై నేను చాలా నమ్మకంగా ఉన్నాను. కానీ విడుదల తేదీలు అర్థం కానీ విధంగా మారాయి. ఈ సమస్యలన్నీ తొలగి సినిమాలు పర్ఫెక్ట్ గా విడుదల కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నా అంటూ నిఖిల్ పేర్కొన్నాడు. 

నిఖిల్ ఆవేదన చెందుతూ చేసిన ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ప్రస్తుతం టాలీవుడ్ పరిస్థితిని ప్రతిబింబించే విధంగా ఈ నిఖిల్ ట్వీట్ ఉందని అంటున్నారు. ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్, భీమ్లా నాయక్, ఆచార్య చిత్రాలు కరోనా పరిస్థితుల కారణంగా వాయిదా పడ్డ సంగతి తెలిసిందే. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా