Shyam Singha Roy : ఓటీటీలో అదరగొడుతున్న ‘శ్యామ్ సింగ రాయ్’.. టాప్ టెన్ మూవీస్ లో థర్డ్ ప్లేస్...

Sreeharsha Gopagani   | Asianet News
Published : Jan 27, 2022, 05:11 PM IST
Shyam Singha Roy : ఓటీటీలో అదరగొడుతున్న ‘శ్యామ్ సింగ రాయ్’.. టాప్ టెన్ మూవీస్ లో థర్డ్ ప్లేస్...

సారాంశం

ఓటీటీ వేదికగా నెట్ ఫ్లిప్ లో విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ మూవీ మిలియన్ల  వ్యూస్ తో దూసుకుపోతోంది. అంతేకాకుండా టాప్ టెన్ నాన్ - ఇంగ్లీష్ మూవీల్లో మూడో స్థానం దక్కించుకుందీ మూవీ.    

న్యాచురల్ స్టార్ నాని రీసెంట్ మూవీ ‘శ్యామ్ సింగరాయ్’విజయవంతంగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ అయ్యి కూడా సంచలనం రేపుతోంది. ఈ నెల జనవరి 21న ఓటీటీలోకి వచ్చిన  ఈ మూవీ మిలియన్ల వ్యూస్ తో దూసుకుపోతోంది.  
 
హీరో నాని (Nani)శ్యామ్ సింగరాయ్ మూవీతో కమర్షియల్ హిట్ కొట్టారు. యంగ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ విభిన్న కాన్సెప్ట్ తో ప్రయోగాత్మకంగా శ్యామ్ సింగరాయ్ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 24న క్రిస్మస్ కానుకగా విడుదలైన శ్యామ్ సింగరాయ్ అటు థియేటర్స్ లో, ఇటు  ఓటీటీలోనూ సత్తా చాటుతోంది.  

 

ఓటీటీలోకి  రావడంతోనే ఈ సినిమా భారీ వ్యూవర్ షిప్స్ తో మంచి రెస్పాన్స్ ని కూడా కొల్లగొట్టింది. వారు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా పెర్ఫామెన్స్ ఏ రేంజ్ లో ఉందో వెల్లడించారు. టాప్ 10 నాన్ ఇంగ్లీష్ సినిమాల జాబితాలో “శ్యామ్ సింగ రాయ్” సినిమా మాత్రమే టాప్ 3 లో నిలిచింది. దీంతో ఏకైక ఇండియన్ సినిమాగా  శ్యామ్ సింగరాయ్ స్థానం దక్కించుకుంది. 

మరి అంతే కాకుండా ఈ సినిమాని నిన్నటికి 35 లక్షల 90 గంటలకి పైగా వ్యూవర్స్ స్ట్రీమింగ్ చేసిందట. ఈ రకంగా సెన్సేషనల్ రెస్పాన్స్ తో టాప్ 3 లో ఈ సినిమా నిలిచచేందుకు కారణమైంది. ఇక ఈ చిత్రంలో సాయి పల్లవి మరియు కృతి శెట్టి లు హీరోయిన్స్ గా నటించి అలరించారు.  


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్స్ టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా