షాకింగ్: తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!

Published : Feb 19, 2019, 12:26 PM IST
షాకింగ్: తండ్రి పాత్రలో విజయ్ దేవరకొండ!

సారాంశం

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే.

టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందిస్తోన్న సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా మొదటి షెడ్యూల్ ని పూర్తి 
చేసుకుంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సింగరేణిలో పని చేసే ఉద్యోగిగా కనిపించనున్నాడు. కార్మికులకు యూనియర్ లీడర్ గా విజయ్ పెర్ఫార్మన్స్ ఓ రేంజ్ లో ఉంటుందని చెబుతున్నారు. 

అయితే కథ ప్రకారం సినిమాలో విజయ్ కి ఎనిమిదేళ్ల కొడుకు కూడా ఉంటాడని సమాచారం. అంటే విజయ్ తండ్రి పాత్రలో కనిపిస్తాడన్నమాట. ప్రేమకథా నేపధ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాలో రాశిఖన్నా, ఐశ్వర్యారాజేష్, క్యాతరిన్ వంటి హీరోయిన్లు కనిపించనున్నారు. 

గోపిసుందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తుండగా.. కెఎస్ రామారావుసినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Kaushal: కాక్రోచ్ జనతా పార్టీకి ఇచ్చిపడేసిన బిగ్ బాస్ కౌశల్, ఇప్పుడేం చేస్తారో చూద్దాం
Zee5 OTT: జీ5 ఓటీటీలో భారీ సినిమాల లైనప్.. వెంకీ అనిల్ 5, ఎన్‌బీకే111, వృషకర్మ అన్నీ ఇందులోనే