ఆ హిట్‌ సినిమాలో నటించమని నానిని ఆ ప్రొడ్యూసర్‌ బలవంతం చేశాడట..

Published : Jan 06, 2021, 02:09 PM IST
ఆ హిట్‌ సినిమాలో నటించమని నానిని ఆ ప్రొడ్యూసర్‌ బలవంతం చేశాడట..

సారాంశం

నాని తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను నటించిన హిట్‌ చిత్రాల్లో `రైడ్‌` సినిమా ఒకటి. ఇందులో నటించమని నిర్మాత బెల్లంకొండ సురేష్‌ చెప్పారట. కానీ తనకు సూట్‌ కాదని, ఇదే విషయాన్ని బెల్లంకొండకి చెప్పాలని ఆఫీస్‌కి బయలు దేరాడట. కానీ..

నేచురల్‌ స్టార్‌ నాని.. ప్రతిభ ఉంటే రాణించడం సాధ్యమే అని నిరూపించుకున్న నటుడు. మామూలు మధ్య తరగతి కుటుంబంలో జన్మించిన నాని, ఎలాంటి సినీ బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా స్వతహాగా ఎదిగారు. ఇప్పుడు స్టార్ ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. జయాపజయాలను అదిగమిస్తూ, ఆటుపోట్లని తట్టుకుని ఈ స్థాయికి చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం `శ్యామ్‌ సింగరాయ్‌`, `టక్‌ జగదీష్‌`, `అంటే సుందరానికి` వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. 

ఇదిలా ఉంటే నాని తాజాగా ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తాను నటించిన హిట్‌ చిత్రాల్లో `రైడ్‌` సినిమా ఒకటి. ఇందులో నటించమని నిర్మాత బెల్లంకొండ సురేష్‌ చెప్పారట. కానీ తనకు సూట్‌ కాదని, ఇదే విషయాన్ని బెల్లంకొండకి చెప్పాలని ఆఫీస్‌కి బయలు దేరాడట. కానీ ఆయన బలవంతంగా ఈ చిత్రంలో నటింప చేశారని, అది తన కెరీర్‌లో పెద్ద హిట్‌ చిత్రంగా నిలిచిందని, తన కెరీర్‌కి చాలా ఉపయోగపడిందని చెప్పారు నాని. 

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా రూపొందిన `అల్లుడు అదుర్స్` చిత్ర ట్రైలర్‌ని మంగళవారం నాని గెస్ట్ గా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఈ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు నాని. ఆ సమయంలో నిర్మాత బెల్లంకొండ పక్కనే ఉండటం విశేషమైతే. బెల్లంకొండ సురేష్‌ తనయుడే బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ కావడం మరో విశేషం. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Champion Movie Review: ఛాంపియన్‌ మూవీ రివ్యూ.. శ్రీకాంత్‌ కొడుకు రోషన్‌కి ఎట్టకేలకు హిట్‌ పడిందా?
శోభన్ బాబు ను సెట్ లో చూసి, ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నారు అని.. ఇంప్రెస్ అయిన హీరోయిన్ ఎవరో తెలుసా?