లైఫ్‌ ఇచ్చిన దర్శకుడు తేజాకి షాక్‌ ఇచ్చిన కాజల్‌

Published : Jan 06, 2021, 11:56 AM IST
లైఫ్‌ ఇచ్చిన దర్శకుడు తేజాకి షాక్‌ ఇచ్చిన కాజల్‌

సారాంశం

ఇటీవల కాజల్‌ మ్యారేజ్‌ చేసుకుంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకుని బిజీ అయిపోయింది. సొంత వ్యాపారాలు ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో తాను కమిట్‌ అయిన సినిమాలు పూర్తి చేసుకునే పనిలో బిజీ అయ్యింది.

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ తనకు లైఫ్‌ ఇచ్చిన దర్శకుడికే హ్యాండిచ్చింది. ముందు నటించేందుకు ఓకే చెప్పి, ఆ తర్వాత హ్యాండిచ్చింది. దీంతో షాక్‌ తినడం దర్శకుడు తేజ వంతయ్యింది. ఇంతకి ఏం జరిగిందనేది చూస్తే, దర్శకుడు తేజ ప్రస్తుతం `అలివేలు వెంకటరమణ` చిత్రాన్ని రూపొందిస్తున్నారు. లేడీ ప్రధానంగా ఈ సినిమా సాగనుంది. ఇందులో నటించేందుకు కాజల్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. 

అయితే ఇటీవల కాజల్‌ మ్యారేజ్‌ చేసుకుంది. ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్‌ కిచ్లుని వివాహం చేసుకుని బిజీ అయిపోయింది. సొంత వ్యాపారాలు ప్రారంభిస్తుంది. ఈ క్రమంలో తాను కమిట్‌ అయిన సినిమాలు పూర్తి చేసుకునే పనిలో బిజీ అయ్యింది. ఇప్పటికే `ఆచార్య` చిత్ర షూటింగ్‌లో పాల్గొంటుంది. మరోవైపు తమిళంలో నటిస్తున్న `హే సినామిక` చిత్ర షూట్‌ ని పూర్తి చేసుకుంది. 

మధ్యలో ఉన్న సినిమాలను పూర్తి చేసుకుని కొత్త కమిట్‌మెంట్లకు కొన్నాళ్లపాటు దూరంగా ఉండాలనుకుంటుందట. అందుకే తేజ సినిమాకి నో చెప్పిందట. ఇప్పట్లో తాను నటించలేని చెప్పినట్టు తెలుస్తుంది. దీంతో కాజల్‌ స్థానంలో తాప్సీని తీసుకున్నారట తేజ. ఇదిలా ఉంటే కాజల్‌.. తేజ రూపొందించిన `లక్ష్మీ కళ్యాణం` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో `నేనే రాజు నేనే మంత్రి`, `సీత` చిత్రాల్లో నటించింది. 2018లో వచ్చిన `సీత` పరాజయం చెందింది.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఇమ్మూ, తనూజ కాదు, కామనర్సే టార్గెట్... సూట్ కేసు తెచ్చేది ఎవరు?
ట్రక్ డ్రైవర్ నుంచి వేలకోట్ల కలెక్షన్స్ రాబట్టే స్థాయికి ఎదిగిన డైరెక్టర్.. ప్రపంచం మొత్తం ఫిదా