
నేచురల్ స్టార్ నాని లేటెస్ట్ మూవీ దసరా. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2023 సమ్మర్ కానుకగా విడుదల కానుంది. నాని కెరీర్ లో మొదటిసారి పూర్తి స్థాయి డీగ్లామర్ రోల్ ట్రై చేస్తున్నారు. ఆయన లుక్ ఫ్యాన్స్ కి సరికొత్త అనుభూతి పంచింది.ఇక దసరా కానుకగా అక్టోబర్ 3న దసరా మూవీ నుండి ఫస్ట్ సింగిల్ విడుదల చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ఆయన ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే మూవీ నుండి ఎలాంటి ప్రోమో విడుదల చేయడం లేదని ఫ్యాన్స్ నిరాశ చెందారు. ఈ క్రమంలో నాని ఆ బాధ్యత తీసుకున్నారు.
దసరా మూవీలో ఓ సాంగ్ చిత్రీకరిస్తుండగా మొబైల్ లో దాన్ని రికార్డు చేశారు. ఆ మొబైల్ రికార్డు కి సంబంధించిన వీడియో నాని సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరా పండుగ సందర్భంగా ఎలాంటి ప్రోమో విడుదల చేయడం లేదని చెప్పారు. అందుకే నేను షూటింగ్ టైం లో నా మొబైల్ లో రికార్డు చేసిన వీడియో లీక్ చేస్తున్నాను. రేపటి నుండి దుమ్ము లేచిపోద్ది... అంటూ వీడియో తో కామెంట్ ట్వీట్ చేశారు. స్వయంగా సినిమా హీరో వీడియో లీక్ చేయడం విశేషంగా మారింది.
అయితే ఇదంతా నాని మూవీ ప్రమోషన్లో భాగంగా చేశారు. ఇక నాని కెరీర్ లో భారీ బడ్జెట్ తో దసరా తెరకెక్కుతుంది. దసరా పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేస్తున్నారు. కీర్తి సురేష్ నానికి జంటగా నటిస్తున్నారు. సుధాకర్ చెరుకూరి నిర్మాత. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తుండగా, సముద్ర ఖని, సాయి కుమార్ కీలక రోల్స్ చేస్తున్నారు. దసరా మూవీతో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని నాని ప్రయత్నం చేస్తున్నారు.